ఈమధ్య స్టార్ సెలబ్రిటీలకు సోషల్ మీడియా చిక్కులుతప్పడం లేదు. ఫ్యాన్స్ కు దగ్గరగా ఉండాలని సోషల్ మీడియాను వాడితే.. సైబర్ నేరగాళ్ళ స్టార్స్ అకౌంట్లు హ్యాక్ చేస్తూ.. రకరకాలుగా ఏడిపిస్తున్నారు. తాజాగా విద్యాబాలన్ కు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. 

స్టార్ సెలబ్రిటీస్ కు సోషల్ మీడియా ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో అభిమానులతో ఇంట్రాక్ట్ అవ్వడానికి స్టార్స్ కు ఎటువంటి ఛాన్స్ లేదు. కాని ఇప్పుడు సోషల్ మీడియా అభిమానులకు.. స్టార్స్ కు వారదిగా పనిచేస్తుంది. అంతే కాదు అందులో తమ అభిమాన తారల అప్డేట్స్ చూస్తూ.. ఫ్యాన్స్ మురిసిపోతుంటారు కూడా. కాగా ఒకప్పుడు సినిమాల ద్వారానే ఫ్యాన్స్ ను సంపాదించుకునే తారలు.. సోషల్ మీడియాలో రకరకాల వేశాలు వేస్తూ.. ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అంతే కాదు చేతినిండా సంపాదిస్తున్నారు కూడా. 

ఇలా రకరకాలుగా సోషల్ మీడియాను వాడేస్తున్నారు. ఈక్రమంలో స్టార్స్ కు సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుందో.. అంతే ఇబ్బంది పెడుతుంది కూడా. స్టార్స్ ఏమైనా పొరపాట్లు చేస్తే.. ట్రోల్స్ అనే ఆయుధంతో నిలబెట్టి కడిగేస్తుంటారు నెటిజన్లు. ఇక హ్యాకర్స్.. స్టార్స్ అకౌంట్లను హ్యాక్ చేసి ఇబ్బందులకు గురిచేయడం. డీప్ ఫేక్ వీడియోలు.. ఇలా రకరకాల ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కు కూడా ఇదే సమస్య వచ్చింది. ఆమె అకౌంట్ హ్యాక్ చేయలేదు కాని.. ఏకంగా ఆమెపేరుతో ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయంపై స్పందించింది విద్య. 

తన పేరు మీద ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాను సృష్టించి ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై విద్యాబాలన్‌ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి విద్యాబాలన్‌ పేరు మీద ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. అది విద్యాబాలన్‌ ఒరిజినల్‌ ఇన్‌స్టా అకౌంట్‌ ఐడీకి దగ్గరగా ఉండటంతో చాలా మంది ఫాలో కావడం మొదలుపెట్టారు.

ఇదే అదనుగా సదరు వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఫాలోవర్స్‌ నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం విద్యాబాలన్‌ దృష్టికి రావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు ఆ నిందితున్ని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. తన పేరు మీద ఉన్న నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలను రిపోర్ట్‌ చేయాలని విద్యాబాలన్‌ అభిమానులను కోరింది.