విషాదం... బాలీవుడ్ యువనటి ఆత్మహత్య.. ఎందుకంటే?
బాలీవుడ్ కుంద చెందిన యువనటి మాలికా రాజ్ పుత్ (Malika Rajput) ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణవార్త ఒక్కసారిగా సినీలోకాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇంతకీ కారణం ఏంటంటే..
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యంగ్ నటి సూసైడ్ చేసుకోవడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ ప్రాంతానికి చెందిన మాలికా రాజ్ పుత్ యంగ్ నటిగా పలు ప్రాజెక్ట్స్ లతో అలరించింది. ఆమె నటి మాత్రమే కాదు.. సింగర్ కూడాను. ఆమె పాటలకు అభిమానులు ఉన్నారు. అలాగే ఆమె కథక్ డాన్స్ లోనూ మంచి ప్రావీణ్యం పొంది ఉన్నారు.
అయితే నటి, సింగర మాలిక్ రాజ్ పుత్ అలియాస్ విజయలక్ష్మీ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారింది. ఆమె మరణంపై బీహార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదైంది... అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తాజాగా మాలికా నివాసం ఉంటున్న గది తలుపులు ఎంతకూ తీడయం లేదు. పిలిచినా పలకలేదు. అనునమానంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చేశారు. అప్పటికే ఫ్యాన్స్ కు ఉరేసుకొని ఆత్మహత్యచేసుకుంది.
డెడ్ బాడీని పోస్టు మార్టం నిమితం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘన కోత్వాలీ నగర్ లో జరిగింది. విషయం తెలియడంతో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.మల్లికా తల్లి సుమ్రితా సింగ్ మాట్లాడుతూ అసలు ఎందుకు సూసైడ్ చేసుకుందో తనకు కూడా తెలియదని చెప్పుకొచ్చింది. ఇక మాలికాకు ప్రస్తుతం 35 ఏళ్లు. నటిగానే కాకుండా ఆమె పొలిటికల్ గానూ ఎంట్రీ ఇచ్చింది. 2016 నుంచి బీజీపేలో కంటిన్యూ అవుతోంది. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగారు. రెండేళ్ల కింద ఆ పార్టీని కూడా వీడారు.