ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితులు ఎక్కువైపోతున్నారు. చిత్రం ఏంటంటే.. కాస్టింగ్ కౌచ్ కు మహిళలే కాదు.. పురుషులు కూడా బాధితులుగా ఉండటం విచిత్రం. తాజాగా మరో బాలీవుడ్  కాస్టింగ్ కౌచ్ బాధితుడు బటకకు వచ్చి తన వాయిస్ వినిపించాడు.  

ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితులు ఎక్కువైపోతున్నారు. మ‌హిళ‌లే కాకుండా పురుషులు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలామంది తారలు తమకు ఎదురైన అనుభవాలు వెల్లడించగా.. తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు రాజీవ్ ఖండేల్వాల్ కూడా తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించాడు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినేని చెప్పిన రాజీవ్ .. త‌న కెరీర్‌లో ఓ సారి త‌న‌కు ఇలాంటి చేదు అనుభ‌వం ఎదురైన‌ట్లు తెలిపాడు. అయితే ఆ టైమ్ లో తాను చాకచక్యంగా ఈ ఉపద్రవం నుంచి తప్పిచుకున్నట్టు ఆయన వెల్లడించాడు. 

రాజీవ్ మాట్లాడుతూ.. తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైన స‌మ‌యంలో ఎలాంటి త‌డ‌బాటుకు గురి కాలేద‌న్నాడు. వెంట‌నే.. సారీ బాస్‌, మీరు చెప్పిన‌ట్లు నేను చేయ‌లేను అని చెప్పి అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన‌ట్లు వెల్ల‌డించాడు. అయితే.. మ‌గ‌వాళ్లు ఇలాంటి ప‌రిస్థితులను డీల్ చేసినంత‌గా మ‌హిళ‌లు చేయ‌లేర‌న్నాడు. మగవారు ఈ విషయాన్ని దైర్యంగా ఎదుర్కోగలరు. కాని.. ఆడవారు మాత్రం ఆ పరిస్థితులను హ్యాండిల్ చేయలేరన్నారు. 

కొన్నిసార్లు అమ్మాయిలు అప్పటి ప‌రిస్థితులకు త‌లొగ్గక తప్పడంలేదన్నారు. ఇష్టం లేకపోయినా..త‌మ‌లో తామే కుమిలిపోతూ.. ఇబ్బంది పడుతున్నారన్నారు. అయితే.. అబ్బాయిలు మాత్రం వాటికి ఎదురునిల‌బ‌డి ముందుకు సాగుతార‌ని, అయితే.. ఆ విష‌యాల‌ను బ‌య‌ట‌కు మాత్రం చెప్ప‌ర‌న్నాడు. సినీ ఇండ‌స్ట్రీలో ఎప్పుడు చూసిన మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోస‌మే మాట్లాడతార‌ని మ‌గ‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని రాజీవ్ వెల్లడించారు. 

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయన్నారు రాజీవ్. ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పురుషాదిప‌త్యం ఉండటం వ‌ల్ల అమ్మాయిలు ఇబ్బంది పడ్డారు.. వారి రక్షణకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారన్నారు. అందులో తప్పులేదు.. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అన్నారు రాజీవ్. బుల్లితెరపై నటుడిగా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు రాజీవ్ ఖండేల్వాల్. బుల్లితెర నుంచి చిన్నగా వెండితెరపై అడుగు పెట్టాడు. బాలీవుడ్ లో తనదైన మార్క్ చూపించి యంగ్ స్టార్.. టేబుల్ 21, సౌండ్ ట్రాక్‌, సైతాన్‌, సామ్రాట్ అండ్ కో లాంటిసినిమాలతో బాగా ఫేమస్ అయ్యారు. మల్టీ టాలెంట్ చూపించిన ఈ యంగ్ హీరో.. హోస్ట్ గా కూడా మంచి పేరు సాధించాడు.