భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితమే రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ దేశాధినేతలు, అధికారిక ప్రతినిధులతో రాజధాని నగరంలో సందడి నెలకొంది. బిజెపి ఎంపీలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే మిత్రపక్షాల సమక్షంలో మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మోడీ కేబినెట్ లో కొలువుదీరే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 

మోడీ ప్రమాణస్వీకారోత్సవం రాష్ట్రపతి భవన్ లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు పరేష్ రావల్ ఓ ట్వీట్ చేశాడు. శంకర్ దాదా చిత్రంలో లింగం మామగా పరేష్ రావల్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మోడీ గురువారం రోజు ప్రమాణస్వీకారం చేసినందుకు పరేష్ రావల్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఎందుకంటే ఈ రోజు పరేష్ రావల్ పుట్టినరోజు. 

పుట్టిన రోజు కావడం, అదే రోజు తన అభిమాన నాయకుడు ప్రధానిగా భాద్యతలు స్వీకరించడంతో పరేష్ రావల్ సంతోషం రెట్టింపైంది. ఇది తనకు అత్యంత పవిత్రమైన రోజు అని పరేష్ రావల్ అభివర్ణించాడు. యురి చిత్రంలో పరేష్ రావల్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల పాక్ పై భారత్ బాంబు దాడి జరిపినప్పుడు పరేష్ రావల్ మోడీ నిర్ణయాన్ని సమర్థించారు.