కరోనా బారినపడుతున్న వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. రన్బీర్ కపూర్, అమీర్ ఖాన్, ఆర్ మాధవన్ లాంటి నటులకు ఇటీవల కరోనా సోకినట్లు తెలిసియజేశారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీనితో పరేష్ రావల్ కొరెంటైన్ కావడంతో పాటు చికిత్స తీసుకుంటున్నారు.  


దాదాపు ఏడాది క్రితం కరోనా వైరస్ కారణంగా దేశంలో ఏర్పడిన దుర్భర పరిస్థితులు తలచుకుంటేనే భయంగొల్పుతున్నాయి. వేల మందిని పొట్టన బెట్టుకున్న ఈ మహమ్మారి... ప్రజలను, ప్రభుత్వాలను తీవ్ర ఇబ్బందులపాలు చేసింది. మరోమారు అదే పరిస్థితులు వస్తాయేమోనని ప్రజలు భయపడుతున్నారు.దానికి కారణం కరోనా వైరస్ మరలా ప్రభలుతుంది. తాజాగా దేశవ్యాప్తంగా వేలల్లో కేసులు నమోదు అవుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పాక్షికమైన లాక్ డౌన్ విధించారు. 


ఇక కరోనా బారినపడుతున్న వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. రన్బీర్ కపూర్, అమీర్ ఖాన్, ఆర్ మాధవన్ లాంటి నటులకు ఇటీవల కరోనా సోకినట్లు తెలిసియజేశారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీనితో పరేష్ రావల్ కొరెంటైన్ కావడంతో పాటు చికిత్స తీసుకుంటున్నారు. 


అయితే పరేష్ రావల్ కొద్దిరోజుల క్రితం కరోనా వాక్సిన్ తీసుకోవడం విశేషం. తాను కరోనా వాక్సిన్ తీసుకున్నట్లు గతంలో సోషల్ మీడియా వేదికగా పరేష్ రావల్ తెలియజేశారు. వాక్సిన్ తీసుకున్నప్పటికీ వైరస్ బారినపడడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వాక్సిన్ వలన పూర్తి స్థాయిలో రక్షణ లేదని అర్థం అవుతుంది. 

Scroll to load tweet…