వరుస విషాదాలు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదేలు చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని భాషల్లో సినీతారలు చాలా మంది తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.. ఇక బాలీవుడ్ లో జూనియర్ మహబూబ్ గా పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు కన్ను మూశారు.
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో మంది తారలను కోల్పోతోంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ఎంతో మంది తారలు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. టాలీవుడ్ లో ఎక్కువగా స్టార్స్ మరణించారు. రీసెంట్ గా సీనియర్ నటుడు చంద్రమోహన్, దక్షిణాది నటి సుబ్బలక్ష్మి, శరత్ కుమారు, విశ్వనాథ్.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా మంది సీనియర్ తారలు ఈలోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇక తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు నయీమ్ సయ్యద్ కన్నుమూశారు.
జూనియర్ మహమూద్ గా పేరు తెచ్చుకున్న ఈ యాక్టర్.. తీరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొన్నాళ్లుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతూ ఉన్నారు. స్ట్రమక్ క్యాన్సర్ కావడం.. అది చివరి స్టేజ్ లో తేలడంతో.. డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారు. మహమూద్ కు క్యాన్సర్ ఉందన్న సంగతి.. 18 రోజుల క్రితమే తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని టాటా మెమొరియల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. క్యాన్సర్ పోర్త్ స్టేజీలో ఉండటంతో బతికే ఛాన్సులు తక్కువని డాక్టర్లు ముందే చేతులు ఎత్తేశారు.
ఇక ఈ స్టేజ్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ .. అది కూడా కీమోథెరపీ చేయటం .. ఆ నొప్పిని ఆయన భరించలేవరని డాక్టర్లు చెప్పారు. అంతే కాదు హాస్పిటల్ లో కంటే.. ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడంతో.. ముంబై నగరంలోని ఖార్‌లో మహమూద్ స్వగృంలోనే ఉంచి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక చికిత్స పొందుతూ.. నయీమ్ ఈ తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో మరణించారు. తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో మహమూద్ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మహమూద్ మరణాన్ని ఫ్యామిలీ అధికారికంగా ధ్రువీకరించారు.
ఇక మహమూద్ మూవీ కెరీర్ గురించి చూస్తే.. ఆయన ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. హిట్ మూవీ మహాబ్బత్ జిందగీ హై సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అసలు పేరు నయిమ్ సయ్యద్ కాగా బాలీవుడ్ దిగ్గజ హాస్య నటుడు మహమూద్.. నయిమ్ పేరును తన పేరు కలుపుతూ.. జూనియర్ మహమూద్‌గా మార్చారు. మహబూబ్ మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణాంతో ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యాక్తం చేస్తున్నారు.
