Asianet News TeluguAsianet News Telugu

విషాదం.. హిందీ ‘సింగం’ నటుడు మృతి.. ప్రముఖుల నివాళి

బాలీవుడ్ ‘సింగం’ నటుడు జయంత్ సావర్కర్ (Jayant Savarkar) కొద్దిసేపటి కింద కన్నుమూశారు. నటుడిగా ఎన్నో చిత్రాలతో మెప్పించి, ప్రేక్షకులను ప్రేమను సొంతం చేసుకున్న ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 
 

Bollywood  Actor Jayant Savarkar Passed Away At 87 NSK
Author
First Published Jul 24, 2023, 4:15 PM IST

మఠారీ, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరాఠీ చిత్రసీమలో ఎంతో ప్రేమాభిమానాలు కలిగిన ప్రముఖ నటుడు జయంత్ సావర్కర్ (Jayant Savarkar)  కొద్దిసేపటి కింద కన్నుమూశారు. ఆయన మరణ వార్తను సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరాఠీ సినిమా, సీరియల్ ప్రపంచంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చారంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా నివాళి అర్పిస్తున్నారు. 

ఇక జయంత్ సావర్కర్ మరాఠితో పాటు హిందీలోనూ వందల సినిమాలు, సీరియల్స్ ల్లో నటించి మెప్పించారు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన 'సింగం' చిత్రంలో జయంత్ సావర్కర్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం వయస్సు మీద బడటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇటీవల సావర్కర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా పరిస్థితి విషమించి కన్నుమూశారు. 

థియేటర్ ఆర్టిస్టుగా కేరీర్ ప్రారంభించిన జయంత్ సావర్కర్ నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక జయంత్ సావర్కర్ 3 మే 1936న జన్మించారు. ఎన్నో మరాఠీ హిందీ థియేటర్, టెలివిజన్, చలనచిత్రాలలో పనిచేశారు. ఆయన నటనకు గానూ 21 మే 2023న అంబరనాథ్ మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్ (AMFF ) వారు అతనికి జీవన్ గౌరవ్ అవార్డు ప్రదానం చేశారు. నాటకరంగంలో మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా నటర్య ప్రభాకర్ పన్షికర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును అందుకున్నారు. ‘సింగం’తో పాటు వాస్తవ్, యుగ్ పురుష్, బకాల్, 66 సదాశివ్, గద్బగ్ గోంధాల్, హరిఓం వంటి సినిమాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. నాటకాలు, సీరియల్స్,, సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ ల్లోనూ నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios