బాలీవుడ్ సీరియల్ యాక్టర్ కరణ్ ఒబెరాయ్ గత కొంత కాలంగా అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలు తప్పని తేలింది.పోలీసుల విచారణలో మహిళ తప్పుడు కేసును నమోదు చేసినట్లు కనుగొన్నారు. వెంటనే ఆ మహిళను ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

అసలు వివరాల్లోకి వెళితే.. మే 6న జ్యోతిష్యం చెప్పుకునే ఒక మహిళ.. కరణ్ అత్యాచారం చేశాడంటూ కేసు నమోదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనపై అత్యాచారం చేశాడని అలాగే రేప్ చేసిన వీడియోలు చూపించి ఎవరికైనా చెబితే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని తన దగ్గర డబ్బులు కూడా తీసుకున్నట్లు ఆమె ఆరోపించింది. 

అలాగే మే 26న కూడా మహిళ దాడి జరిగినట్లు పోలీసులకు తెలిపింది. ఇద్దరు దుండగులు తనపై దాడి చేసి కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించినట్లు చెప్పగా పోలీసులను వారిని పట్టుకొని ఆరా తీశారు. అయితే ఈ ప్లాన్ అంతా మహిళదే అని ఆ ఇద్దరు వ్యక్తులు అసలు విషయాన్నీ బయటపెట్టారు. అలాగే అందులో ఒక వ్యక్తి మహిళ సంప్రదించిన లాయర్ కి బంధువే అని అతనికి 10 వేల రూపాయలు ఇచ్చినట్లు విచారణలో తెలిసినట్లు పోలీసులు తెలిపారు.