జగన్ సర్కార్ కు మరియు వైసీపీ నేతలకు చిరంజీవి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారంటూ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ రిప్లై ఇచ్చారు.  


సినీ టికెట్ల ధరలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో ధరకు తగ్గిస్తూ…జీవో నంబర్ 35 ను తీసుకురాగా తెలంగాణ లో టికెట్ రేట్స్ పెంచుతూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలో చిరంజీవి, విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ కోరికను మన్నించి నిర్మాతలు, పంపిణీదారులు, చిత్ర ప్రదర్శనదారులు అందరికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ ధరలను సమర్థించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. థియేటర్ల మనుగడకు, వేలాది కార్మికులకు మేలు చేసే నిర్ణయం ఇది. సినిమా వారి సమస్యలను అర్థం చేసుకున్న ఛీప్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, చొరవ తీసుకున్న ఎంపి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

అలాగే ఇక్కడ చిరంజీవి.. ఏపీ టిక్కెట్ల విషయాన్ని లేవనెత్తలేదు. కేవలం తెలంగాణ గురించి మాత్రమే ప్రస్తావించారు. ఇదే దీని ద్వారానే జగన్ సర్కార్ కు మరియు వైసీపీ నేతలకు చిరంజీవి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారంటూ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి అపకారం చేయబోయి, మొత్తం ఇండస్ట్రీకే నిప్పుపెట్టారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.

Scroll to load tweet…

 మరో ప్రక్క సమస్యను పరిష్కరించడానికి వచ్చే వారంలో చిరంజీవి ఏపీ సీఎంను కలిసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే విషయమై విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆరోగ్యకరమైన అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసాని తెలుగు చలన చిత్రపరిశ్రమను పరిశ్రమగా మార్చాలని కృషి చేస్తున్నారు. నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.