తాజాగా సముద్రఖని విమానం అనే ఎమోషనల్ చిత్రంలో నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

విలక్షణ నటుడిగా, దర్శకుడిగా సముద్రఖని సౌత్ లో తనదైన ముద్ర వేస్తున్నారు. సముద్రఖని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా రాణిస్తూనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ తో చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా సముద్రఖని విమానం అనే ఎమోషనల్ చిత్రంలో నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్ లో ఈ సినిమా రూపొందుతోంది. శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 

విమానం సినిమాలో స‌ముద్ర ఖని అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే మ‌ధ్య వ‌య‌స్కుడిగా, భార్య లేక‌పోయినా పిల్లాడిని జాగ్ర‌త్త‌గా చూసుకునే వీర‌య్య అనే తండ్రి పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రంలో అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమె బర్త్ డే సందర్భంగా అనసూయ పాత్ర ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. 

తాజాగా ఆమె పాత్రపై చేసిన సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అనసూయ పాత్ర పేరు సుమతి. అనసూయ వేశ్యగా నటిస్తోంది అంటూ బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ సుమతీ అంటూ సాగే లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో అనసూయ బోల్డ్ స్టిల్స్ లో కనిపిస్తోంది. 

నడుము, ఎద అందాలు ఆరబోస్తూ కవ్విస్తోంది. ఆమె వెంట పడే పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపిస్తున్నాడు. 'సుమతీ.. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనితా ' అంటూ చరణ్ అర్జున్ అద్భుతంగా పాడారు. ఈ పాటని రాసింది, పాడింది, కంపోజ్ చేసింది సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ కావడం విశేషం. 

అనసూయ అందాల కొలతలపైనే ఈ పాటని రాసినట్లు అర్థం అవుతోంది. రాహుల్ రామకృష్ణ కోణంలో ఈ పాట సాగుతుంది. నీ ఎత్తు పొడవు చూస్తే పుడతది మునులకైన తిక్క అంటూ ఒకరేంజ్ లో అనసూయ అందాన్ని వర్ణించారు. ఆస్తి పాస్తీ లేని గరీబోడిని నీకు వెయ్యి రూపాయలు ఎక్కడ నుంచి ఇవ్వను అంటూ రాహుల్ రామకృష్ణ వాపోతున్నట్లు ఈ సాంగ్ లో ఉంది. అంటే అనసూయ వేశ్యగా నటిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఆమె అందంపై మనసు పారేసుకున్న యువకుడిగా రాహుల్ రామకృష్ణ దొగచాటుగా అనసూయ అందం చూస్తున్నాడు. 

YouTube video player

వినసొంపుగా, బోల్డ్ గా, అందంగా ఉన్న సుమతీ పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది. అసలు అనసూయ వేశ్య పాత్రకి, రాహుల్ రామకృష్ణకి, సముద్ర ఖనికి సంబంధం ఏంటి అనే ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రాన్ని జూన్ 9న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.