హీరో అక్కినేని నాగార్జునకు చెందిన పొలం దగ్గర గుర్తుతెలియని మృతదేహం  బయటపడింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం పాపిరెడ్డి గూడలో ఆయన వ్యవసాయ క్షేత్రంలోని ఓ గదిలో కుల్లిపోయిన మృతదేహం కనిపించడం కలకలం రేపింది. పొలంలో ఉన్న ఓ గదిలో కుళ్లిపోయిన డెడ్ బాడీని గుర్తించి వాళ్లు పోలీసులకు చెప్పారు.ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది.

40 ఎకరాల క్షేత్రంలో సేంద్రీయ పంటలు పండించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా  సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంపారు. అయితే పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన ఈ మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఆ శవం దొరికిన గదిని సీజ్ చేశారు. 

ఇక  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు..? ఎప్పుడు మరణించాడు..? ఎవరు చంపారు..? లేక ఆత్మహత్యా లేక సహజమరణమా అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ విషయంపై ఇంకా నాగార్జున స్పందించలేదు.