Asianet News TeluguAsianet News Telugu

కష్టం మాస్టర్ (‘బ్లఫ్‌ మాస్టర్‌’సినిమా రివ్యూ)

'శతురంగ వెట్టై' సినిమా తమిళంలో ఓ సంచలనం. తన తెలివితో అందరినీ మోసం చేస్తూ బ్రతికే ఓ ఛీటర్ కథ ఇది. అయితే ఎందుకనో తెలుగులో రీమేక్ కావటానికి మూడేళ్లు పట్టింది. దాంతో ఆ యాంగిల్ లో  అంతగా క్రేజ్ క్రియేట్ లేదనే చెప్పాలి. 

bluff master movie telugu review
Author
Hyderabad, First Published Dec 28, 2018, 3:49 PM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

'శతురంగ వెట్టై' సినిమా తమిళంలో ఓ సంచలనం. తన తెలివితో అందరినీ మోసం చేస్తూ బ్రతికే ఓ ఛీటర్ కథ ఇది. అయితే ఎందుకనో తెలుగులో రీమేక్ కావటానికి మూడేళ్లు పట్టింది. దాంతో ఆ యాంగిల్ లో  అంతగా క్రేజ్ క్రియేట్ లేదనే చెప్పాలి. అలాగే రీమేక్ అనగానే ..స్టార్స్ డేట్స్ ఇస్తూంటారు...భారీగా ఖర్చుపెడుతూంటారు. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు సంపాదించిన పెట్టిన బంగారు బాతు రీమేక్. 

అయితే ఈ ఈ  రీమేక్ సినిమాని .. ఇప్పుడిప్పుడే నటుడుగా నిలదొక్కుకుంటున్న సత్యదేవ్ తో చేసారు. స్టార్స్ దొరక్కో లేక కంటెంట్ తో కుమ్మేద్దాం అనుకునో... నిర్మాతలు నమ్మి చేసి ఉండాలి. అయితే రీమేక్ ల కు ఓ లక్షణం ఉంది.. సినిమా  సరైన డైరక్టర్ పడితే రీమేక్ రాణిస్తుంది..లేకుంటే మేకులా సినిమా చూస్తున్నంతసేపూ గుచ్చుకుంటూంటుంది.  ఇంతకీ ఈ సినిమా ఈ రెండింటిలో ఏ కోవకి చెందింది..కంటెంట్ ని నమ్మిన నిర్మాతకు కలిసి వస్తుందా..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం...

 

కథేంటి..

ఉత్తమ్‌ కుమార్  (స‌త్య‌దేవ్‌)ఓ మోసగాడు. తన తెలివితో ఎదుటివారిని అత్యాశను క్యాష్ చేసుకుని కోట్లు సంపాదిస్తూంటాడు. ఆ మోసపోయిన వాళ్లు అతనిపై రివేంజ్ కు ప్రయత్నిస్తూంటాడు.  వేర్వేరు వేషాలుతో మోసాలు చేసే అతన్ని కోర్టులు, పోలీస్ వ్యవస్ద కూడా ఏం చెయ్యలేకపోతుంది. న్యాయాన్ని సైతం డబ్బుతో కొనేసి హ్యాపీగా బయిట తిరుగుతూంటాడు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. 

ఉత్తమ్ కుమార్ ని అతని చేతిలో మోసపోయినవాళ్ళు  విలన్ పగ బట్టి అతన్ని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళ నుండి బయట పడే క్రమంలో మోసం చేసి సంపాదించిన డబ్బంతా ఫ్రెండ్స్ మోసంలో  పోగొట్టుకుంటాడు. అక్కడ నుంచి అతనికి తను చేస్తున్న తప్పుడు పనులు ఏంటో అర్దమవుతాయి. దాంతో మోసాలకు స్వస్ది చెప్పాలనుకుంటాడు. కానీ అదంత ఈజీ గా అయ్యే పనికాదు.  అతనికి మంచిగా మారాలనిపించినా మారటానికి అవకాసం ప్రపంచం ఇవ్వదు. అతను చేసిన మోసాలే అతనికి శాపాలుగా మారి వెంబడించి...చావు దాకా తీసుకువెల్తాయి. 

అప్పుడు ఉత్తమ్ ఏం చేసాడు... తిరిగి నేర ప్రపంచంలోకి వెళ్లిపోయాడా, అసలు అతను ఈ మోసగాడుగా మారటానికి గల కారణమేంటి,అలాగే  ఉత్తమ్ జీవితంలోకి వచ్చిన అవని ఎవరు...వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 

ఎలా ఉంది..

సినిమా ప్రారంభం  నుంచి చివ‌రివ‌ర‌కు ర‌క‌ర‌కాల స్కీమ్ లు వేసి, స్కామ్ లు చేసి జనాలన్ని మోసం చేయటమే హీరో లక్ష్యం. అయితే ఆ మోసాలు అన్ని మనకు దాదాపు తెలిసినవే...అవ‌న్నీ మ‌నం రోజూ పేపర్లలలో , టీవీల్లో చూస్తున్నవే. దాంతో ఏ సీన్ పెద్దగా థ్రిల్లింగ్ గా లేదు..అరే భలే మోసం చేసాడే అనిపించలేదు.  అలాగే మిగతా కథనం కూడా...దొంగ రాముడు నుంచి చూస్తున్నదే. అన్నింటినీ వ‌దులుకుని ప్ర‌శాంతంగా జీవిద్దామ‌ని హీరో ప్ర‌య‌త్నించినా... చేసిన మోసాలు, తప్పులు మ‌ళ్లీ మెడ‌కు చుట్టుకోవ‌డం, దానివ‌ల్ల గ‌ర్భ‌వ‌తిగా ఉన్న భార్య‌ని కూడా వ‌దిలేయాల్సిన పరిస్థితి రావ‌డం వంటివి రొటీన్ గా అనిపిస్తాయి. అలాగే సెంకడాఫ్ స్పీడు తగ్గి విసిగిస్తుంది. 

 

తేడా కొట్టేసేది..

ఇమేజ్‌ ఉన్న హీరో ఈ చిత్రంలోని హీరో పాత్ర చేస్తే అంతగా ప్రేక్షకుల్లోకి చొచ్చుకుని పోదన్న ఆలోచనతో దర్శకుడు సత్యదేవ్ ని ఎంచుకున్నారని చెప్పారు. ఓ సామాన్యుడిగా పాత్రలో ఒదిగిపోవాలంటే ఇమేజ్‌ లేని హీరోనే కరెక్ట్‌ అని భావించారన్నారు. అది నిజమే అని సినిమా చూసాక అనిపిస్తుంది. నిజంగా కాస్త పేరున్న స్టార్ ఈ సినిమా చేస్తే ...కష్టమనిపిస్తుంది. హీరో ఏంటి ఇలా చేస్తున్నాడని తేడా కొట్టేస్తుంది. దాంతో సత్యదేవ్ ని ఎంచుకోవటం మంచి ఆప్షనే అని అర్దమవుతుంది. అలాగే సత్యదేవ్ సైతం తన నటనతో విషయం లేని సీన్స్ ని సైతం నిలబెట్టే ప్రయత్నం చేసాడు.  

 

ఎవరెలా చేసారు..

డబ్బే ముఖ్యమనుకునుకుంటూ...ఎంజాయ్‌ చేస్తూ తిరగడం కోసం మోసం చేసైనా డబ్బు సంపాదించాలనుకునే వ్యక్తిగా  సత్యదేవ్ నటించటాడు అనటం కన్నా పరకాయ ప్రవేశం చేసాడని చెప్పాలి.  ఈ క్యారక్టర్ కు రివర్స్ లో  డబ్బు కాదు ప్రేమే ముఖ్యమనే అవని అనే అమ్మాయి పాత్రలో నందిత శ్వేత క్యాజువల్ గా చేసింది.  అలాగే ధనశెట్టి అనే పాత్రలో పృథ్వి బాగానే నవ్వించారు. హీరోకు,ఫృధ్వీకి మధ్య సాగే సన్నివేశాలు ఎంటర్టైన్మెంట్ గా ఉన్నాయి. సినిమాలో  మోటీవేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ల రాఘవేంద్ర గారు చేసిన పాత్ర బాగుంది. 

 

మార్పులు ..చేర్పులు.

శతురంగ వెట్టై అనే తమిళ చిత్రానికి ఈ  రీమేక్‌ అయినప్పటికీ తెలుగులో చాలా  మార్పులు చేశారు. కొన్ని మార్పులు కథలో కలిసిపోతే..మరికొన్ని కృతకంగా మారాయి.. ముఖ్యంగా హీరో,హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ వంటివి విచిత్రంగా ఉంటాయి. అలాగే తమిళ సినిమా వచ్చి మూడేళ్లు దాటింది. ఈ లోగా ఇక్కడ మన తెలుగు ప్రాంతంలోనూ కరక్కాయ స్కామ్ దగ్గర నుంచి బోలెడు జరిగాయి. వాటిని నేర్పుగా కథలోకి తీసుకువచ్చి ఉంటే ఇంట్రస్టింగ్ గా ఉండేది. 

 

టెక్నికల్ గా.. 

డైలాగులు బాగున్నాయి కానీ హీరోయిన్ కు రాసినవి వింతగా ఉన్నాయి. నిర్మాణ విలువలు మాత్రం లోపించాయనే చెప్పాలి.  సినిమాటోగ్రఫీ బాగుంది.  సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అందించిన పాటలు జస్ట్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత షార్ప్ గా చేయాలి. 

 

ఫైనల్ ధాట్

థ్రిల్లర్ మోడ్ లో టైట్ స్క్రీన్ ప్లే తో నడిస్తేనే ఇలాంటి కథలు చూడగలం. లేకుండా భరించాల్సి వస్తుంది. 

 

ఎవరెవరు..

న‌టీన‌టులు: స‌త్య‌దేవ్‌, నందితా శ్వేత‌, బ్ర‌హ్మాజీ, పృథ్వీరాజ్‌, చైత‌న్య ‌కృష్ణ‌, సిజ్జు, టెంప‌ర్ వంశీ, బాల‌కృష్ణ, ఆదిత్య మేన‌న్ త‌దిత‌రులు

సంగీతం: సునీల్ క‌శ్య‌ప్ 

ఛాయాగ్ర‌హ‌ణం: దాశ‌ర‌థి శివేంద్ర 

ర‌చ‌న: గోపిగ‌ణేష్‌, పుల‌గం చిన్నారాయ‌ణ‌

కూర్పు: న‌వీన్ ‌నూలి 

 

క‌ళ‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి

స‌మ‌ర్ప‌ణ‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌ 

నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై 

ద‌ర్శ‌క‌త్వం: గోపిగ‌ణేష్

విడుద‌ల‌: 28 డిసెంబ‌రు 2018

Follow Us:
Download App:
  • android
  • ios