బ్లడ్ అండ్ చాక్లెట్ మూవీ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రిజ్ ఈ రోజు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.  

సౌత్ లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ .... ఎస్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన సినిమా బ్లడ్ అండ్ చాక్లెట్. శంకర్ నిర్మాతగా వచ్చిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి సినిమాలు ఎంత సక్సెస్ అయ్యాయో తెలిసిందే. ఈక్రమంలోనే డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ లో మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ గా బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమాను నిర్మించారు. షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ చిత్రాలను రూపొందించి, నేషనల్ అవార్డ్ సాధించిన వసంతబాలన్ డైరెక్షప్ లో ఈసినిమా తెరకెక్కుతోంది. 

 ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపు పొందిన అర్జున్ దాస్ హీరోగా, దుసరా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మయూవీ నంచి ఫస్ట్ లుక్ మరియు టీజర్ ట్విట్టర్ వేదికగా దిల్ రాజు విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జూలై 21న విడుదలకానుంది. తెలుగులో ఎస్.ఆర్ డి.ఎస్ సంస్థ చిత్రాన్ని విడుదల చేయనుంది.. ప్రముఖ సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ నాలుగు అద్భుతమైన పాటలు అందించారు. ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని దర్శకుడు వసంతబాలన్ చెప్పారు. 

ఇక ఈ సినిమాలో వనితా విజయ్ కుమార్, అర్జున్ చిదంబరం, సురేష్ చక్రవర్తి తదితరులు నటించారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో .. అర్జున్ దాస్ కాస్త భయంకరమైన లుక్ లో కనిపిస్తున్నాడు. కంప్లీట్ రెడ్ కలర్ పోస్టర్.. క్రైమ్ థ్రిల్లర్ ను సూచిస్తోంది. మరి ఈసినిమా ఎలాంటి సక్సెస్స్ సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.