Top Gun Maverick: ఓటిటి రిలీజ్ డేట్ ఇచ్చేసారు, వచ్చే వారమే
తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న టామ్ క్రూస్ తాజా చిత్రం `టాప్ గన్-మావరిక్` ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్యంగా ఘన విజయం సాధించింది.
`మిషన్ ఇంపాజిబుల్` సిరీస్ చిత్రాలు సినీ ప్రియులు అందరికి తెలుసు. ఈ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూస్. అతడి నుంచి సినిమా వస్తోందంటే అభిమానుల్లో వుండే క్రేజే వేరు. ఆశ్చర్య పరిచే యాక్షన్ సన్నివేశాలు.. భారీ ఛేజ్లు అన్ లిమిటెడ్ గా ఉంటాయి. తనని ఇష్టపడే ఆడియన్స్ ని మరింత ఎగ్జయిట్ మెంట్ కి గురిచేయాలని యాక్షన్ సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లు లేకుండా తానే ప్రాణాలకు తెగించి నటిస్తుంటాడు. అలా తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న టామ్ క్రూస్ తాజా చిత్రం `టాప్ గన్-మావరిక్` ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్యంగా ఘన విజయం సాధించింది.
`టాప్ గన్-మావరిక్` చిత్రం అమేజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్ వంటి మెయిన్ స్ట్రీమ్ ఓటిటిలలో స్ట్రీమ్ అవ్వటం లేదు. ఈ యాక్షన్ డ్రామా...Book My Show Stream లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ ఈ సినిమా ని కొనుక్కోవటమో లేక రెంట్ కు తీసుకుని చూడటమో చేయవచ్చు. ఇది ఒక ప్రీమియర్ అవుటింగ్ గా బుక్ మై షో స్ట్రీమింగ్ టీమ్ చెప్తోంది.
34 ఏళ్ల క్రితం టామ్ క్రూస్ నటించిన `టాప్ గన్` చిత్రానికి `టాప్ గన్-మావరిక్` పేరుతో సీక్వెల్ తీసారు. ఇందులో టామ్ క్రూస్ రూడ్ బిహేవియర్ గల పైలెట్ గా కనిపించి తన విన్యాసాలతో ఆశ్చర్య పరిచాడు. ఈ చిత్రాన్ని తన గ్రాఫిక్స్ మాయాజాలంతో ఆకట్టుకున్న `ట్రోన్ లెగస్సీ` ఫేమ్ జోసెఫ్ కోసిన్స్కీ 140 మిలియన్ డాటర్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాడు. పారామౌంట్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ యాక్షన్ ప్రియులకు తెగ నచ్చేసింది. కొండల్ని.. సముద్రాల్ని తాకుతూ టాప్ క్రూస్ చేసే వైమానిక విన్యాసాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
టామ్ క్రూస్ సినిమా అంటే కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తుంటారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ సినిమా ఉండటంతో ఘన విజయం సాధించింది. ఓటిటిలో కూడా సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు. గత చిత్రాలకు మించి ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ అధికంగా వుంటాయని టామ్ చెబుతున్నారు. అమెరికన్ ఏవియేషన్ కి అంకితమిచ్చిన ఈ సినిమా చిత్రీకరణ కోసం ముందు అమెరికన్ ప్రభుత్వం ఏవియేషన్ ఫ్లైట్ ని వాడేందుకు అంగీకరించలేదట. ఆ తరువాత అంగీకరించినట్లు చెప్పారు. అబ్బుర పరిచే విన్యాసాలతో విజువల్ వండర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జూన్ 26న పారామౌంట్ పిక్చర్స్ సంస్థ విడుదల చేసింది. ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది.