Asianet News TeluguAsianet News Telugu

‘డబుల్ ఇస్మార్ట్’కు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్.. మళ్లీ పూరీకి హిట్ ట్రాక్స్ ఇవ్వబోతున్న మణిశర్మ

‘డబుల్ ఇస్మార్ట్’కు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తోడయ్యారు. ఇస్మార్ శంకర్ తో ఊపూపిన సంగీత బ్రహ్మ మణిశర్మ మరోసారి ఇస్మార్ట్ టీమ్ తో జాయిన్ అయ్యారు. ఈ మేరకు అప్డేట్ అందించారు. 
 

Blockbuster music director Mani Sharma joined with Double Ismart NSK
Author
First Published Nov 24, 2023, 12:49 PM IST

నాలుగేళ్ల కింద వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్ పోతినేని మాస్ హిట్ ను అందుకున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)  తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మళ్లీ పూరీ ఈజ్ బ్యాక్ అన్నారు. కానీ లైగర్ తో సీన్ రివర్స్ అయ్యింది. మళ్లీ కథ మొదటికి వచ్చింది. ‘లైగర్’ తెచ్చిన నష్టాల నుంచి పూరీ తేరుకొని వెంటనే ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)ను ప్రకటించారు. 

మళ్లీ రామ్ పోతినేని (Ram Pothineni)తో కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. శరవేగంగా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. డబుల్ స్పీడ్ తో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. షూట్ నిరంతరంగా కొనసాగుతోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. ఎక్కడా కంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, రామ్ పోతినేని నెక్ట్స్ లెవల్ మేకోవర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా డబుల్ ఇస్మార్ట్ నుంచి క్రేజీ అప్డేట్ అందింది.  మరోసారి పూరీ డైరెక్షన్ కు సంగీత బ్రహ్మ, బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ (Mani Sharma) సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబో మరోసారి కన్ఫమ్ కావడంతో సినిమా హిట్ అంటున్నారు. గతంలో వీరి కాంబోలోని ‘పోకిరి’, ‘ఏక్ నిరంజన్’, ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వచ్చాయి. వాటికి మణిశర్మ హిట్ ట్రాక్స్ అందించిన విషయం తెలిసిందే. 

ఇక తాజాగా మరోసారి Double Ismart కు కూడా మణిశర్మ బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా యూనిట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎలాంటి బీజీఎం, సాంగ్స్ అందిస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 8న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios