బ్లాక్ పాంథర్ నటుడు చాడ్విక్ బోస్మాన్ మరణించాడు. గత నాలుగేళ్లుగా పెద్ద ప్రేగు క్యాన్సర్‌ తో పోరాడుతూ మరణించాడని ఆయన కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. 2016 నుండి స్టేజ్ త్రీ ప్రేగు క్యాన్సర్‌ తో బాధపడుతూ వైద్యం తీసుకుంటున్నారు.ఆయన ఫ్యామిలీ విడుదల చేసిన ఆ ప్రకటనలో అతను తన ఇంటిలో, అతని భార్య మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా మరణించాడని పేర్కొన్నారు. 

‘నిజమైన పోరాట యోధుడు, చాడ్విక్ పట్టుదలతో మీరు ఎంతో ప్రేమించిన అనేక చిత్రాలను మీ ముందుకు తీసుకువచ్చాడు. చాడ్విన్‌ ఇంట్లోనే మరణించాడు" అని చాడ్విక్‌ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇక  దక్షిణ కరోలినాలోని అండర్సన్‌లో పుట్టి పెరిగిన బోస్‌మాన్‌... 2013లో లెజండరీ బేస్ బాల్ ఆటగాడు జాకీ రాబిన్సన్ కథతో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘42’ తో సినిమాల్లో వచ్చాడు. 2016లో వచ్చిన కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్‌లో మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా కనిపించి అంనతరం బోస్‌మెన్‌​ అతని ఇంటి పేరుగా మారింది. 

ఆ తర్వాత 2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. అతను అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్,ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌లోని మరో రెండు పాత్రలతో అభిమానులను అలరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన దర్శకుడు స్పైక్ లీ డా 5 బ్లడ్స్‌లో అతని చివరి సినిమా అని చెప్పాలి.