పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ చేపట్టిన మెరుపు దాడుల నేపధ్యంలో బాలీవుడ్ లో 'ఉరి' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ అయింది. ఎమోషనల్ గా ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.

ఇప్పుడు ఈ సినిమాను కొంతమంది బీజేపీ నేతలు తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసుకోవడంలో పోటీపడుతున్నారు. తాజాగా మాండ్యా బీజేపీ నేత ఎన్.ఎస్.నందీశ్ రెడ్డి తన నియోజక వర్గ పరిధిలో 'ఉరి' సినిమా టికెట్లను ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు.

ఫిబ్రవరి 21వరకు ఈ ఆఫర్ ఇచ్చారు. తమ నియోజక పరిధిలోని వార్డులకు సంబంధించిన నేతలను కలిసి టికెట్లు తీసుకోవాలని ప్రకటించారు. దీనిపై మాట్లాడిన నందీశ్ రెడ్డి.. ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నా, దేశమంతా తిరిగి వస్తున్నామన్నా.. దానికి కారణం సైనికులేనని.. రాజకీయ నిర్ణయాల కారణంగా ఈ 60 ఏళ్లలో ఎంతోమంది ప్రాణాలు విడిచారని చెప్పారు.

సైనికులపై దాడి జరిగిన వెంటనే ప్రధాని మోదీ స్పందించిన సర్జికల్ స్ట్రైక్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు మోదీ మద్దతుతారులకు 'హౌ ఈజ్ ద జోష్' ప్రచారాస్త్రమైందని అన్నారు.