`విరాటపర్వం` ప్రీ రిలీజ్‌ వేడుకలో సినిమాపై హైప్‌ని పెంచింది యూనిట్‌. చివరగా విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. `బర్త్ ఆఫ్‌ వెన్నెల` పేరుతో నాలుగు నిమిషాల వీడియో క్లిప్ ని విడుదల చేశారు.

`విరాటపర్వం` చిత్రానికి రోజు రోజుకి హైప్‌ పెరుగుతుంది. మొన్నటి కర్నూల్‌ లో జరిగిన ఈవెంట్‌, వరంగల్‌లో జరిగిన ఈవెంట్‌తో మరింత క్రేజ్‌ వచ్చింది. తాజాగా బుధవారం హైదరాబాద్‌లో `విరాటపర్వం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. వెంకటేష్‌ గెస్ట్ గా ఈ వేడుక జరిగింది. వెంకీ మరింత హైప్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రామ్‌చరణ్‌,సుకుమార్‌ రావాల్సి ఉండగా, వారు అందుబాటులో లేకపోవడంతో రాలేకపోయారు. 

ఇదిలా ఉంటే ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో సినిమాపై హైప్‌ని పెంచింది యూనిట్‌. చివరగా విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. `బర్త్ ఆఫ్‌ వెన్నెల` పేరుతో నాలుగు నిమిషాల వీడియో క్లిప్ ని విడుదల చేశారు. ఇందులో వెన్నెల(సాయిపల్లవి) పుట్టుకని చూపించారు. ఎంతటి పోరులో, ఎంతటి యుద్ధంలో, ఎంతటి రక్తపాతంలో వెన్నెల పుట్టిందనే విషయాన్ని కళ్లకి కట్టినట్టు చూపించారు. ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగే ఈ వీడియో హృదయాలను హత్తుకునేలా ఉంది. `కారణం ఎప్పుడూ ఉంటుంది. కానీ అది ఎల్లప్పుడూ సహేతుకం కాదు` అనే కారల్‌ మార్క్స్ కొటేషన్‌తో ఈ వీడియో ప్రారంభమవుతుంది.

ఈ వీడియోలో ఏం చూపించారనేది చూస్తే, అది 1973 తెలంగాణ రూరల్‌-ఆంధ్రప్రదేశ్‌ సమీపంలోని అడవి. రాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తుంది. గర్భంతో ఉన్న ఓ తల్లి పురిటినొప్పులతో బాధపడుతుంటుంది. ఆమెని టాక్టర్‌ లో అడవి నుంచి సమీపంలో పట్టణానికి తీసుకెళ్లేందుకు బయలు దేరుతారు. మధ్యలోకి రాగానే అడవిలో అటు పోలీసులకు, నక్సల్స్ కి మధ్య భీకరమైన కాల్పులు జరుగుతుంటాయి. మరోవైపు ఆ తల్లికి పురిటి నొప్పులు ఎక్కువై తట్టుకోలేకపోతుంది. కాల్పుల కారణంగా డ్రైవర్‌ టాక్టర్‌ని ఆపేస్తాడు. విషయం తెలిసి ఆమె భర్త ఆవేదన చెందుతుంటారు. ఇది గమనించిన ఓ లేడీ నక్సలైట్‌(నివేదా పేతురాజ్‌) ప్రాణాలను లెక్కచేయకుండా పోలీసులకు ఎదురు కాల్పులు జరుపుతూ టాక్టర్‌ వద్దకి చేరుకుంటుంది. 

అక్కడ తాను డాక్టర్‌ అని చెప్పడం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. అనంతరం ఇంజెక్షన్‌ ఇచ్చి ఆ తల్లికి డెలివరీ చేసింది. పండంటి ఆడబిడ్డని చేతుల్లో తీసుకుని వెన్నెల కాచిన రాత్రిలో చందమామని చూస్తూ ఆమెకి వెన్నెల అని పేరుపెడుతుంది. అంతలోనే ఆమె తలలోకి బుల్లెట్‌ దూసుకురావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోతుంది. ఆద్యంతం భీకరంగా, హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ సన్నివేశం హత్తుకుంటుంది. ఆకట్టుకుంటుంది. వెన్నెల పుట్టుక వెనకాల పెద్ద యుద్ధమే ఉందని, పెద్ద రక్తపాతం జరిగిందనే విషయాన్ని దర్శకుడు వేణు ఉడుగుల ఈ `బర్త్ ఆఫ్‌ వెన్నెల` వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో వెన్నెల పాత్రలో సాయిపల్లవి నటించిన విషయం తెలిసిందే.

ఇది ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతుండటం విశేషం. రానా, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయనున్నారు.