బాలీవుడ్ లో ప్ర‌ముఖ హిరోయిన్ బిపాసాబ‌సు తాజాగా బ‌య‌ట‌ప‌డిన బిపాసాబ‌సు మ‌రో యాంగిల్ ర్యాంప్ వాక్ ఒప్పందం కుదుర్చుకుని చివరికి కుచ్చు టోపీ పెట్టిన బిపాసా
ఇండియా-పాకిస్తాన్, లండన్ ఫ్యాష్ షో ర్యాంప్ వాక్ లో హొయలు పోతానని నిర్వాహకులతో అమ్మడు ఒప్పందం కుదుర్చుకుని చివరికి వాళ్లందరికీ కుచ్చు టోపీ పెట్టేసింది. చివరి నిమిషంలో షో కు గైర్హాజరై ఇలా చివాట్లు తినాల్సి వచ్చింది. షో నిర్వాహకురాలు రోహిణి శర్మ రేఖి లైన్ లోకి వచ్చి బిప్స్ వేశాలన్నింటిని బట్టబయలు చేసింది.
`బిప్స్ కు లండన్ లో స్టార్ హోటల్ గదులు బుక్ చేశాం. వెంట భర్తను తీసుకొస్తానంటే ఒప్పుకున్నాం. అడ్వాన్స్ ఇచ్చాం. అక్కడ ల్యాండ్ అవ్వగానే రెండు సిమ్ కార్డులిచ్చాం. అందులో ఐదు పౌండ్లు మాత్రమే రిచార్జ్ ఉందని వాటిని నేలకేసి కొట్టింది. షో కోసం ఇచ్చిన అమౌంట్ ను హనీమూనికి ఖర్చు పెట్టేసుకుంది. అయినా భరించాం. వాటన్నింటిని మర్చిపోయి షోకు రావాలని గౌరవంగా పిలించాం. రానని మొండికేసింది. దీంతో మేము భారీగా నష్టపోయాం.
మా నష్టం పూడ్చాల్సిందే. అప్పటి వరకూ బిప్స్ పై పొరడతమని మధ్యలో మసాలా దట్టించి నానా చివాట్లు పెట్టింది ఆర్గనైజేషన్.
