కథ వినిపించిన తర్వాత రజినీకాంత్ ఎగ్జయిట్ అయ్యారని, త్వరలోనే ఫైనల్ కాల్ ఏమిటనే విషయం మీద క్లారిటీ ఇస్తానని వేణుకి చెప్పి పంపించినట్లు తెలుస్తోంది.


ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట‌ర్ చిత్రాల‌లో ‘బింబిసార’ ఒక‌టి. చాలా కాలం త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్‌కు ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలవటంతో ఈ దర్శకుడుపై అందరి దృష్టి పడింది. మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఆగ‌స్టు 5న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. బింబిసారుడిగా క‌ళ్యాణ్‌రామ్ న‌ట‌న‌కు ఏ స్థాయిలో ప్ర‌శంస‌లు ద‌క్కాయో, ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట‌కు కూడా అదే స్థాయిలో గుర్తింపు వ‌చ్చాయి. డెబ్యూ సినిమానే అయిన వ‌శిష్ట‌ టేకింగ్‌కు సినీ ప్ర‌ముఖులు సైతం ఆశ్చ‌ర్యపోయారు.ఈ నేపధ్యంలో వశిష్ట ఏ హీరోతో తదుపరి చిత్రం చేయబోతున్నారనే విషయమై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

 తాజాగా టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం మేరకు వేణు ఇటీవల చెన్నై వెళ్లి రజినీకాంత్ ని కలిసినట్లు తెలుస్తోంది. బింబిసార టాక్ తెలుసుకున్న రజనీకాంత్ వేణు కథ వినటానికి ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. అలా చెన్నై వెళ్లిన వేణు, రజినీకాంత్ కి తన కథ వినిపించారని తెలుస్తోంది. కథ మొత్తం విన్న తర్వాత రజనీకాంత్ ప్రస్తుతానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అలా అని నో కూడా చెప్పలేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వస్తుంది.

కథ వినిపించిన తర్వాత రజినీకాంత్ ఎగ్జయిట్ అయ్యారని, త్వరలోనే ఫైనల్ కాల్ ఏమిటనే విషయం మీద క్లారిటీ ఇస్తానని వేణుకి చెప్పి పంపించినట్లు తెలుస్తోంది. ఒకవేళ వేణుకి రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఆయన దశ తిరిగినట్లే. మొదటి సినిమాతోనే కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారతో హిట్టు ఆయన ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సినిమా ఫైనల్ అయితే కనుక ఆయన కెరీర్ ఇంకెక్కడికో వెళ్లి పోవడం ఖాయం అంటున్నారు.

 ప్ర‌స్తుతం వ‌శిష్ట బింబిసార-2 స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడు. అలాగే రిలీజైన కొత్తలో బాలయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాను ఫ్యామిలీతో కల్సి వీక్షించారు. ఫ్యామిలీ కోసం స్పెషల్ షో ఏర్పాటు చేశారు కళ్యాణ్ రామ్. ఈ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ చిత్రయూనిట్ ను అభినందించారు. సినిమా చాలా బాగుందని అన్నారు. అలాగే సినిమాలో భావితరాలకు కావల్సిన సందేశం ఉంది. అందరూ తప్పక చూడండి అంటూ.. తన ఫ్యాన్స్ ను కోరారు బాలయ్య. అంతేకాదు.. అబ్బాయి కళ్యాణ్ రామ్‌ను ఆశ్వీరదించారు.. డైరెక్టర్ వశిష్ఠ్‌ను అభినందించారు ఈ నందమూరి హీరో. అంతే కాదు తప్పకుండా కలిసి సినిమా చేద్దాం అంటూ దర్శకుడు వశిష్ఠకు ఛాన్స్ కూడా ఇచ్చారు బాలయ్య. బాలయ్య ఛాన్స్ ఇచ్చాడంటే మాటలు కాదు. మరి బాలయ్య కోసం వశిష్ఠ కథను సిద్ధం చేస్తాడేమో చూడాలి.