బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ప్రయాణిస్తోన్న కారు.. బైక్ పై వెళ్తోన్న ఓ యువకుడిని ఢీకొట్టింది. అతడు హెల్మెట్ కూడా ధరించలేదని తెలుస్తోంది. పక్కనే ఉన్న డివైడర్ కి బైక్ వెళ్లి కొట్టుకోవడంతో అతడి తలకి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన జరీన్ ఖాన్ తో పాటు ఆమె టీమ్ బాధితుడిని ఆసుపత్రికి తరలించింది. ఈ యాక్సిడెంట్ గోవాలో చోటు చేసుకుంది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది.

జరీన్ ఖాన్ కారు డ్రైవ్ చేసిందా లేక మరొకరా..?అనే విషయాలు తెలియాల్సివున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన 'వీర్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది జరీన్. బాలీవుడ్ రెడీ సినిమాలో 'క్యారెక్టర్ దీలా' అనే ఐటెం సాంగ్ లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది.  ఈ ఏడాదిలో '1921' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.