Asianet News TeluguAsianet News Telugu

bigg boss5 :ప్రియాంకకి గోరు ముద్దలు తినిపించిన మానస్‌.. సన్నీని మగాడు కాదన్న ప్రియా..

మంగళవారం ఎపిసోడ్‌లో నామినేషన్ కి సంబంధించిన చర్చ జరిగింది. మానస్‌ తనని దూరం పెడుతున్నాడని, పట్టించుకోవడం లేదంటూ ఆనీ మాస్టర్‌ ముందు వాపోయింది ప్రియాంక. కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమె కోసం వచ్చాడు మానస్‌. ఆమెని బ్రతిమాలాడు.

biggboss5 priya setires on sunny and priyanka emotional about manas
Author
Hyderabad, First Published Oct 19, 2021, 11:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌5 ఆరు వారాలు పూర్తయ్యాయి. ఏడో వారం మరింత రంజుగా సాగుతోంది. సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో లోబో, జెస్సీ, శ్రీరామ్‌, ప్రియా, కాజల్‌, సిరి, ఆనీ మాస్టర్‌ నామినేట్‌ అయ్యారు. ఏడో వారంలో వీరిలో ఒకరు ఎలిమినేట్‌ కానున్నారు. మరోవైపు లోబో సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 

ఇక మంగళవారం Bigg Boss5ఎపిసోడ్‌లో నామినేషన్ కి సంబంధించిన చర్చ జరిగింది. మానస్‌ తనని దూరం పెడుతున్నాడని, పట్టించుకోవడం లేదంటూ ఆనీ మాస్టర్‌ ముందు వాపోయింది ప్రియాంక. కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమె కోసం వచ్చాడు Manas. ఆమెని బ్రతిమాలాడు. నామినేషన్‌లో Sunny తన నామినేషన్‌ని తీసుకోలేదని తన బాధని వ్యక్తం చేసింది. అందుకు మానస్‌ Priyankaని ఓదార్చే ప్రయత్నం చేశాడు. చివరికి అన్నం తినిపిస్తానన్నాడు. అంతేకాదు భోజనం తీసుకొచ్చి ఆమెకి తినిపించాడు. 

also read: హాట్‌ షోలో రెచ్చిపోయిన నిధి అగర్వాల్‌.. పోగుల్లాంటి డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలను చూస్తే చెమటలు పట్టాల్సిందే

అయితే అంతకు ముందు తాను ఇతర అమ్మాయిలకు తినిపించిన దాని గురించి అడిగింది ప్రియాంక. అవన్నీ చూస్తున్నావా? అంటూ ఆరా తీశాడు మానస్‌. హౌజ్‌లో ఇన్ని కెమెరాలున్నాయి, అందులో నేను కూడా ఓ కెమెరానే అని, ఓ కన్ను ఎప్పుడూ నిన్నేచూస్తుందని తెలిపింది ప్రియాంక. దీనికి గునుగుతూ మ్యానేజ్‌ చేశాడు మానస్‌. ప్రియాంకకి తినిపిస్తూ ఉన్నాడు. మరోవైపు నామినేషన్‌కి సంబంధించి యాంకర్‌ రవి, కాజల్‌ ల మధ్య కూడా చర్చ జరిగింది. తప్పుని ఒప్పుకోవాలని రవి, తాను ఒప్పుకోనని కాజల్‌ వాదించుకున్నారు. చివరికి రవికి సారీ చెప్పింది కాజల్‌. 

అనంతరం కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా `బంగారు కోడి పెట్టా` అనే టాస్క్ పేరుతో కోడి గుండ్లని సేకరించాల్సి ఉంటుంది. మిసెస్‌ ప్రభావతి అనే పెద్ద కోడి గుండ్లు పెడుతుంది. దాన్నుంచి సభ్యులు పోటీ పడి దక్కించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ గుండ్లు సేకరించిన వాళ్లు కెప్టెన్సీ టాస్క్ లో కెప్టెన్‌ పోటీకి అర్హులవుతారు. ఈ గేమ్‌ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. మిసెస్‌ ప్రభావతి అనే కోడి పెద్ద గుండ్లు పెడితే, హౌజ్‌లోకి చిన్న చిన్న గుండ్ల వచ్చి పడ్డాయి. వీటికోసం ఇంటి సభ్యులు పోటీ పడ్డారు. గొడవలకు దిగే పరిస్థితి ఎదురయ్యింది. 

ఈ గేమ్‌ ఎవరికి వాళ్లు స్వతహాగా ఆడాలని బిగ్‌బాస్‌ తెలిపారు. కానీ సభ్యలు జంటలుగా ఆడారు. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడారు. సన్నీ, మానస్‌, కాజల్‌ జాయింట్‌గా ఆడారు. ఆ తర్వాత ప్రియా, మానస్‌ జాయింట్‌ అయ్యారు. సపోర్ట్ చేసుకున్నారు. ఆనీ మాస్టర్‌, శ్రీరామ్‌ జాయింట్‌గా, జెస్సీ, షణ్ముఖ్‌ జాయింట్‌గా ఆడారు. విశ్వ, రవి, సిరి సింగిల్‌గానే ఆడారు. 

also read:`జబర్దస్త్` రష్మి నడుము సొగసు చూడతరమా.. మెడలో ముత్యాల హారం స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ పిక్స్

ఇందులో మరోసారి ప్రియా, సన్నీల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. సన్నీని మగాడివైతే గేమ్‌ ఆడాలని, ధైర్యంగా ఆడాలని, దొంగతనం చేయడం కాదంటూ కామెంట్లు చేసింది. పవన్‌ కళ్యాణ్‌ స్టయిల్‌ మ్యానరిజంతో సన్నీని ఓ రేంజ్‌లో ఆడుకుంది Priya. ఆడవారిలా ఆడుతున్నావంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించింది ప్రియా. దీంతో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హీటు పెంచాయి. మరోవైపు షణ్ముఖ్‌ అన్న మాటలకు సిరి సైతం ఫీల్‌ అయ్యింది. ఏడ్చింది. చివర్లో మానస్‌ సైతం ఎమోషన్‌ అవ్వడం సస్పెన్స్ గా మారింది. అతన్ని సన్నీ ఓదార్చాడు. హౌజ్‌ నుంచి బయటకు వెళ్లాక కూడా మంచి స్నేహితులుగానే ఉంటామన్నాడు సన్నీ. 

ఇదిలా ఉంటే హౌజ్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌ స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. చాలా రోజులుగా ప్రియాంక, మానస్‌ల మధ్య ఓ రకమైన లవ్‌ ట్రాక్‌ నడుస్తుంది. మానస్‌ని ప్రియాంక బాగా ఇష్టపడుతుంది. అయితే తాజాగా మరో కొత్త లవ్‌ ట్రాక్‌ తెరపైకి వచ్చింది. సిరి.. శ్రీరామ్ కి క్లోజ్‌ అవుతుండటం విశేషం. ఈ విషయాన్ని షణ్ముఖ్‌.. జెస్సీతో అన్నారు. ఆ తర్వాత సిరితోనూ అన్నాడు. దీనిపై వీరి మధ్య డిస్కషన్‌ కూడా జరిగింది. అయితే సిరి మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఇది హౌజ్‌లో ఆసక్తికరంగా మారింది. ఇది వరకే శ్రీరామ్‌.. హమీదతో లవ్‌ స్టోరీ సాగించారు. హమీద ఎలిమినేట్‌ కావడంతో ఇప్పుడు సిరికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడనే సిగ్నల్స్ వస్తున్నాయి. 

alsor read: నభా ఒంటిని గట్టిగా హత్తుకున్న టైట్ ఫిట్... అందమైన ఒంపులు చూపిస్తూ హీట్ పెంచిన స్మార్ట్ బ్యూటీ!

Follow Us:
Download App:
  • android
  • ios