బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పది వారాలు పూర్తయాయి. ఎనిమిది మంది మిగిలి ఉన్నారు. అభిజీత్, హారిక, లాస్య, అఖిల్, మోనాల్, సోహైల్, అరియానా, అవినాష్ ప్రస్తుతం హౌజ్‌లో ఉన్నారు. ఇక ఇప్పటి నుంచే బిగ్‌బాస్‌4 విన్నర్‌ ఎవరు అనేదానిపై చర్చ ప్రారంభమైంది. ఊహా రాయుళ్ళు విజేతలను ప్రకటిస్తున్నారు. మరికొందరు ఆ ఇద్దరి మధ్య, ఈ ఇద్దరి మధ్య పోటీ అని చెబుతున్నారు. 

ఆ మధ్య బిగ్‌బాస్‌3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ స్పందిస్తూ, అభిజిత్‌ విన్నర్‌ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఆయన లవర్‌, బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ పునర్నవి భూపాలం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పుడు బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ విన్నర్‌ కౌశల్‌ కూడా అదే చెబుతున్నాడు. అభిజిత్‌, సోహైల్‌ మధ్యే పోటీ ఉంటుందని అంటున్నారు. మరికొందరు అభిజిత్‌, లాస్యల మధ్య పోటీ ఉండొచ్చని, అభిజిత్‌, లాస్య, సోహైల్‌, అఖిల్‌, అవినాష్‌ టాప్‌ ఫైవ్‌లో ఉంటారని అంటున్నారు. లవ్‌ కపుల్‌ అఖిల్‌, మోనాల్‌ మధ్యలోనే వెళ్లిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

అంతేకాదు పదకొండో వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో కూడా చెప్పేస్తున్నారు. ఈ వారంలో హారికనిగానీ, మోనాల్‌నిగానీ పంపించే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనేది ఉత్కంఠ నెలకొంది. హౌజ్‌లో సభ్యులు తగ్గే కొద్ది టెన్షన్‌ పెరుగుతుంది. సభ్యుల్లో ఎమోషన్‌ కూడా పెరుగుతుంది. అందుకే ఎలిమినేషన్‌ టైమ్‌లో సభ్యులు బాగా ఎమోషనల్‌ అయిపోతున్నారు. ఆదివారం ఎలిమినేట్‌ అయిన మెహబూబ్‌ విషయంలో ఇదే జరిగింది.

ఇదిలా ఉంటే ఎలిమినేషన్‌ ప్రక్రియ విషయంలో కొత్త చర్చ మొదలైంది. ఆడియెన్స్ ఓట్ల ద్వారానే ఎలిమినేషన్‌ జరుగుతుందా? బిగ్‌బాస్‌ తాను అనుకున్న వారిని ఎలిమినేట్‌ చేస్తున్నారా? అన్నది చర్చ జరుగుతుంది. అయితే కొందరు సభ్యులను పంపించే విషయంలో ఇది మరింత అనుమానాలకు తావిస్తుంది. కుమార్‌ సాయిని పంపించే విషయంలో ఈ చర్చ ప్రారంభమైంది. బిగ్‌బాస్‌పై విమర్శలు వచ్చాయి. గ్లామర్‌ బ్యూటీ అయిన మోనల్‌ని సేవ్‌ చేయడం కోసం కుమార్‌ సాయిని పంపించారనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వినిపించాయి. మెహబూబ్‌ విషయంలో అదే జరుగుతుంది. 

మరోవైపు విన్నర్‌ విషయంలో కూడా బిగ్‌బాస్‌ నిర్ణయం ప్రకారమే జరుగుతుందని, ఇదంతా ముందస్తు ఒప్పందమని, ఆడియెన్స్ ఓట్లు ఫైనల్‌లో పనిచేయవని అంటున్నారు. నిజానికి ఈ చర్చ గత సీజన్‌లోనూ వినిపించింది. ఇప్పుడు మరోసారి అది హైలైట్‌ అవుతుంది. దాని ప్రకారం ఈ వారం ఫైనల్‌కి వెళ్లేది అభిజిత్‌, లాస్యలు మాత్రమే అని, వీరిద్దరిలో ఒక్కరిని విన్నర్‌గా ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ లెక్కన బిగ్‌బాస్‌4 విన్నర్‌ ఎవరో తెలిసిపోయిందని అంటున్నారు ఊహా రాయుళ్లు. మరి ఇందులో నిజమెంతా అన్నది చూడాలి.