బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు పూర్తి చేసుకుంటోంది. శనివారం రెండో ఎలిమినేషన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌజ్‌లో టీమ్‌ లీడర్‌ని మార్చడం చర్చనీయాంశంగా మారింది. ప్రారంభం నుంచి టీమ్‌ లీడర్‌గా లాస్య ఉండి, అన్ని సవ్యంగా అయ్యేలా చూసుకున్నారు. 

మూడో వారం ప్రారంభం కాబోతున్న సమయంలో టీమ్‌ లీడర్‌ మార్చడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే కొత్త టీమ్‌ లీడర్‌ ఎంపికలో లాస్య ప్రధానంగా నలుగురి నోయల్‌, అభిజిత్‌, కళ్యాణి, మెహబూబ్‌ పేర్లని సూసించింది. వారు నలుగురు వచ్చి తాము ఏం చేస్తామో తెలిపారు. అయితే అందరు కలిసి నోయల్‌ అయితే బాగుంటుందని చెప్పడం విశేషం.

 ఇక నోయల్‌ తన వంతు వచ్చేసరికిగా ఎవరికి ఏం అవసరం ఉందో తెలుసని, వారి అవసరాలు తెలుసుకుని సర్వ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఇలా సభ్యులందరు నోయల్‌ పేరుని బిగ్‌బాస్‌కి సిఫార్సు చేశారు. బిగ్‌బాస్‌ కూడా నోయల్‌ని ఫైనల్‌ చేశాడు. బిగ్‌బాస్‌ ఫనిష్‌మెంట్‌ టైమ్‌లో నోయల్‌ నాగార్జునతో చెప్పి ఈ శనివారం వెళ్ళిపోతానని బెదిరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు లీడర్‌షిప్‌ కట్టబెడటం అనేక ఆలోచనలకు తావిస్తోంది.

ఆ వెంటనే కిచెన్‌ టీమ్‌ని మార్చేశారు. కళ్యాణి కిచెన్‌ నుంచి తప్పుకుని ఇప్పుడు ఫ్రీ అయ్యింది. తాను ఫ్రీగా ఉంటే గాసిప్‌లు వస్తాయని చెప్పడం నవ్వులు పూయించింది. అంతకు ముందు కిచెన్‌లో లాస్యకి, నాగవల్లికి వివాదం నెలకొంది. తనకి ఇచ్చిన పని చేస్తున్నానని నాగవల్లి స్పష్టం చేసింది. అయితే ఎలిమినేషన్‌ ప్రారంభమైనప్పట్నుంచి వెనకాల ఏదో జరుగుతుంది. అందరు ఏదో డిస్కస్‌ చేసుకున్నారని, ఏదో తేడా జరుగుతుందని వివాదం క్రియేట్‌ చేసింది. దాన్ని లాస్య ఆపే ప్రయత్నం చేసినా దేవి వినకుండా వెళ్లిపోయింది.