ఎంత ఫ్రెండ్స్ అయినా 24 గంటలు కలిసి ఉండటం కష్టం. ఓ వారం రోజులు కలిసే ఉండటం ఇంకా కష్టం. నెల రోజులంటే అస్సలు సాధ్యం కాదు. రెండు నెలలు ఇక ఛాన్సే లేదు. కానీ కేవలం ఒక్క బిగ్‌బాస్‌ హౌజ్‌లోనే మూడున్నర నెలలు సభ్యులు కలిసే ఉంటారు. దీంతో వారి మధ్య అటాచ్‌మెంట్‌ తెలియకుండానే ఏర్పడుతుంది. అది విడిపోయే సమయంలోనే బయటపడుతుంది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ పదో వారం ఎలిమినేషన్‌లో తేటతెల్లమయ్యింది. 

ఆదివారం మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. అందరు ఊహించినట్టే మెహబూబ్‌ ఎలిమినేషన్‌ జరిగింది. అయితే గతంలో మాదిరిగా ఏ ఒక్కరిద్దరు ఏడుపులతో మెహబూబ్‌ సెండాఫ్‌ జరగలేదు. ఇంటి సభ్యులు మొత్తం మెహబూబ్‌ ఎలిమినేషన్‌ని జీర్ణించుకోలేకపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఆఖరికి ఎమోషనల్‌ విషయాల్లో ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే అభిజిత్‌ కళ్లల్లో సైతం నీళ్లు తిరిగాయి. ఎమోషనల్‌ అయ్యాడు. 

ఇక సోహైల్‌ కన్నీళ్ళకు, బాధకు అంతేలేదు. హౌజ్‌లో నిజంగానే వీరిద్దరి మధ్య బలమైన బాండింగ్‌ ఉంది. ఇద్దరు క్లోజ్‌ఫ్రెండ్స్ లానే ఉంటారు. సొంత అన్నదమ్ముల మాదిరిగా మెలిగారు. గేమ్స్ లోనూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంటారు. వీరి స్నేహం గురించి అందరికి తెలిసిందే. మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవుతున్నాడని తెలిసి సోహైల్‌ చిన్న పిల్లాడిలా ఎక్కి ఎక్కి ఏడవడం అందరిని మరింత ఎమోషనల్‌కి గురి చేసింది. ఇక స్టేజ్‌పైకి వెళ్లిన మెహబూబ్‌ సైతం తన ఫ్రెండ్స్ ని చూసుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు. సోహైల్‌ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు తన ఎమోషన్‌ని కంట్రోల్‌ చేసుకోలేకపోయాడు. మరింత గట్టిగా కంటతడి పెట్టాడు.

ఇదిలా ఉంటే ఎలిమినేట్‌ అయిన సభ్యుడు ఇతర సభ్యుల గురించి తనకు దగ్గరగా ఉన్నవాళ్ల గురించి పాజిటివ్‌గా, మరికొందరి గురించి నెగటివ్‌గా చెప్తారు. కానీ ఫస్ట్ టైమ్‌ మెహబూబ్‌ అందరి గురించి పాజిటిగ్‌గా చెప్పడమే కాదు.. చాలా పాజిటివ్‌గా చెప్పాడు. గత ఎలిమినేటర్‌ అమ్మ రాజశేఖర్‌ కూడా పాజిటివ్‌గానే చెప్పాడు. కానీ ఈ రేంజ్‌లో పాజిటివ్‌గా చెప్పడం కేవలం మెహబూబ్‌ విషయంలోనే జరిగింది. సభ్యులతో తనకున్న అటాచ్‌మెంట్ అలాంటదని చెప్పొచ్చు. వెళ్లే ముందు నాగ్‌ సైతం మెహబూబ్‌ని హగ్‌ చేసుకున్నాడు. ఎలిమినేట్‌ అయిన సభ్యుడిని హగ్‌ చేసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైమ్‌. 

ఇక హౌజ్‌ నుంచి ఇప్పటి వరకు 11 మంది ఎలిమినేట్‌ కాగా ఇక  ప్రస్తుతం అభిజీత్, హారిక, లాస్య, అఖిల్, మోనాల్, సోహైల్, అరియానా, అవినాష్ హౌజ్‌లో ఉన్నారు. మరో ఐదు వారాలు ఈ షో జరుగనుంది.