బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న మోనాల్‌ గజ్జర్‌..తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. దేత్తడి హారిక విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ని స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటింది. జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ నుంచి ప్రేరణ తీసుకుని సవాల్‌ని స్వీకరించి మొక్కలు నాటినట్టు తెలిపింది మోనాల్‌. `అడవులను, పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్‌ కుమార్‌ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్‌ సిండియా ఛాలెంజ్‌ అని తెలిపింది. ఈ సందర్భంగా మరో నలుగురిని నామినేట్‌ చేసింది. మాకప ఆనంద్‌, మిత్ర గాద్వి, క్రిష్ణ కుల్‌ శేఖరన్‌, మల్హాత్‌ థాకర్‌లను నామినేట్‌ చేసింది. మొక్కలు నాటాలని చెప్పింది. 

ఇక బిగ్‌బాస్‌ పూర్తయిన తర్వాత స్టార్‌ మాలో ఆఫర్‌ కొట్టేసింది మోనాల్‌. `డాన్స్ ప్లస్‌` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఇటీవల `అల్లుడు అదుర్స్` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. అలాగే తన హౌజ్‌ ప్రియుడు అఖిల్‌తో మరింత సన్నిహితంగా ఉంటూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.