బిగ్‌బాస్ 4, ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఫైనల్‌గా ఈ వారం ఆరుగురు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. వారిలో అమ్మా రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్ ఉన్నారు.
బిగ్‌బాస్ 4, ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఫైనల్‌గా ఈ వారం ఆరుగురు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. వారిలో అమ్మా రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్ ఉన్నారు.
ఈ నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఫైర్ అవ్వడం వంటి సంఘటనలతో సాగింది. ముఖ్యంగా అఖిల్, అమ్మా రాజశేఖర్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు విరుకుపడ్డారు. సింపతి విషయంలో అమ్మాని అఖిల్ నామినేషన్ చేయగా, అదే విషయంలో అఖిల్‌ని నామినేట్ చేశాడు అమ్మా. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
పొగిడితే మంచి వారు, లేకపోతే చెడ్డవారిగా భావిస్తారని అమ్మాపై అఖిల్ విమర్శించారు. అఖిల్, అభిజిత్, మోనాల్ విషయంలో ముగ్గురికి గొడవ అయ్యింది. ఇష్యూ అయ్యింది. కానీ అది వదిలేసి అఖిల్.. అభిజిత్ తో క్లోజ్ అయ్యారు. ఈ విషయంలో తనకు నచ్చేలదన్నారు అమ్మా. దీనికి అఖిల్ స్పందిస్తూ, ఆ విషయాలపై, అమ్మా తనపై చేసిన విషయాలపై నేను చాలా ఫీల్ అయ్యానని, తమ అమ్మా నాన్న కూడా ఫీల్ అయ్యి ఉంటారని అన్నారు. దీనికి అమ్మా కూడా ఘాటుగానే స్పందించారు. మొత్తంగా ఇద్దరి మధ్య వివాదం హౌజ్‌ని హీటెక్కించింది. మొత్తానికి అత్యధిక ఓట్లతో అమ్మా రాజశేఖర్ నామినేట్ అయ్యారు.
