బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఇంటిసభ్యులు తమకి నచ్చిన, తమని ఇబ్బంది పెట్టిన వారిని నామినేట్‌ చేశారు. 

ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో నామినేషన్‌లో భాగంగా ఇంటిసభ్యులు తాము నామినేట్‌ చేయాలనుకున్న వారిపై ఎర్ర ఎండు మిర్చి దండాలను వేయాలని బిగ్‌బాస్‌ చెప్పారు. 

దానిలో భాగంగా సభ్యులు ఎలిమినేట్‌ చేశారు. ఇందులో అరియానా- మెహబూబ్‌, మోనాల్‌ని నామినేట్‌ చేసింది, దివి-నోయల్, మెహబూబ్‌ని నామినేట్‌ చేసింది. నోయల్‌- దివి, అభిజిత్‌లను, హారిక- అరియానా, కుమార్‌ సాయిని నామినేట్‌ చేసింది. అభిజిత్‌- మెహబూబ్‌, అఖిల్‌ లను, లాస్య- మెహబూబ్‌, దివిలను, మెహబూబ్‌-దివి, అరియానాలను, సోహైల్‌- అరియానా, కుమార్‌ సాయిలను, అమ్మ రాజశేఖర్‌- లాస్య, అభిజిత్‌ లను నామినేట్‌ చేశారు. 

దీంతోపాటు అఖిల్‌-అభిజిత్‌, అరియానాలను నామినేట్‌ చేశారు. కుమార్‌ సాయి- హారిక, మోనాల్‌ని నామినేట్‌ చేశారు. కెప్టెన్‌కి ప్రత్యేక అధికారం ఉందని, నామినేట్‌ అయిన సభ్యుల్లో ఒకరిని సేవ్‌ చేసే అవకాశం ఉందని, వారి పేరుని చెప్పాలని బిగ్‌బాస్‌కి చెప్పారు. దీంతో సోహైల్‌.. మెహబూబ్‌ని సేవ్‌ చేశారు.

దీంతో ఫైనల్‌గా అరియానా, అభిజిత్‌, మోనాల్‌, కుమార్‌ సాయి, దివి, అఖిల్‌, నోయల్‌, లాస్య, హారిక ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయినట్టు బిగ్‌బాస్‌ ప్రకటించారు.