బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 54వ రోజు శుక్రవారం ఇంటి సభ్యులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు బిగ్‌బాస్‌. చివర్లో సభ్యులకు ఈ యాభై నాలుగు రోజులు జరిగిన ఎపిసోడ్‌ని రీకలెక్ట్ చేశాడు. ఇప్పటి వరకు సగం దూరం వచ్చామని చెప్పారు. ఈ జర్నీలో ప్రేమలున్నాయి, ప్రేమించడాలున్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, నవ్వులున్నాయి, ఏడుపు ఉంది. కోపాలున్నాయి, అసహ్యాలున్నాయి, ఎన్నో గాయలున్నాయి. 

ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఎంతో మారారు. స్నేహాలు వచ్చాయి. అనుబంధాలు పెరిగాయి. ఎమోషనల్‌గా మారారు. బిగ్‌బాస్‌ ఇన్ని రోజులు పంచిన జ్ఙాపకాలను ఓ సారి గుర్తు చేసుకుందామని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ హైలైట్స్ చూపించారు. దీంతో ఇంటిసభ్యులు ఎంతో ఆనందంగా ఫీల్‌అయ్యారు. కొందరు ఎమోషనల్‌ అయ్యారు. 

ముఖ్యంగా అరియానా కన్నీళ్లు పెట్టుకుంది. తనకు తమ కుటుంబం గుర్తుకొస్తుందని ఏడ్చింది. ఈ రెండుమూడు రోజులుగా తాను అందరి మధ్య ఉన్నా, ఒంటరి ఫీలింగ్‌ కలుగుతుందని తెలిపింది. అంతకు ముందు బిగ్‌బాస్‌ ఆమెకి, తాను కోరిన టెడ్డీ బేర్‌ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ సమయంలో కూడా అరియానా కన్నీళ్ళు పెట్టుకుంది. ఇక అరియానాని అవినాష్‌ ఓదార్చారు. మేమున్నామని ఆమెని ఓదార్చారు.