Asianet News TeluguAsianet News Telugu

బిగ్‌బాస్‌ హోస్ట్ ఛేంజ్‌.. సల్మాన్‌ స్థానంలో కరణ్‌.. డైరెక్ట్ ఓటీటీలో!

సల్మాన్‌ స్థానంలో స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ హోస్ట్ చేయబోతున్నారట. 15వ సీజన్‌ బిగ్‌బాస్‌ హోస్ట్ గా సల్మాన్‌ స్థానంలో కరణ్‌ జోహార్‌ వ్యవహరించనున్నారని సమాచారం. 

biggboss host change salman replace with karan johar for ott version arj
Author
Hyderabad, First Published Jul 24, 2021, 8:57 PM IST

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ దేశ వ్యాప్తంగా ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ,మలయాళంలో ఇది రన్‌ అవుతుంది. అత్యధికంగా హిందీలో ఇది 14 సీజన్లని పూర్తి చేసుకుంది. ఇప్పుడు 15వ సీజన్‌ స్టార్ట్ కాబోతుంది. ఇందులో 11 సీజన్లకి కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్ చేశారు. గతేడాది కూడా ఆయనే హోస్ట్ చేయనున్నారట. తాజాగా ఈ విషయాన్ని నిర్వహకులు ప్రకటించారు.

సల్మాన్‌ స్థానంలో స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ హోస్ట్ చేయబోతున్నారట. 15వ సీజన్‌ బిగ్‌బాస్‌ హోస్ట్ గా సల్మాన్‌ స్థానంలో కరణ్‌ జోహార్‌ వ్యవహరించనున్నారని సమాచారం. ఇది సీజన్‌ మొత్తానికి కాదు. కేవలం తొలి ఆరు వారాలకు గాను కరణ్‌ హోస్ట్‌గా చేయనున్నారు. అంతేకాకుండా ఈ ఎపిసోడ్స్‌ నేరుగా టీవీలో కాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్‌(voot)లో 24×7 ప్రసారం చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. ఆగస్టు 8నుంచి  ఈ షో ప్రీమియర్ స్ట్రీమింగ్ కానుంది. మరో విశేషం ఏంటంటే ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ ఎంపిక నుంచి ప్రతివారం వారికి ఇచ్చే టాస్క్‌ల వరకు ప్రతిది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని సమాచారం.

బిగ్‌బాస్‌ ఓటీటీలో ప్రసారం కానున్న తొలి ఆరు వారాల ఎపిసోడ్‌కు గాను హోస్ట్‌గా సిధార్థ్ శుక్లా, ఫరా ఖాన్, రోహిత్ శెట్టి వంటి పేర్లు వినిపించాయి. కానీ తాజాగా మేకర్స్‌ కరణ్‌ జోహార్‌ను సీజన్‌15 హోస్ట్‌గా ప్రకటిస్తూ ఊహాగానాలకు చెక్‌ పెట్టారు. ఈ సందర్భంగా కరణ్‌ జోహార్‌ స్పందిస్తూ, `బిగ్‌బాస్‌ షోకి నేను, మా అమ్మ పెద్ద ఫ్యాన్స్‌. ఒక్కరోజు కూడా మిస్‌ కాకుండా చూస్తాం. అంతేకాకుండా నేను ఎప్పటికైనా బిగ్‌బాస్‌ షోను హోస్ట్‌ చేయాలని మా అమ్మ కోరిక. అది ఇప్పుడు నెరవేరుతుంది. గతంలో ఎన్నో షోలకు హోస్ట్‌గా చేయడాన్ని ఎంజాయ్‌ చేశాను. కానీ ఇప్పుడు బిగ్‌బాస్‌ షోకు వ్యాఖ్యాతగా చేయడం మరింత ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది` అంటూ పేర్కొన్నారు. 

ఓటీటీలో ప్రసారం అయ్యే తొలి ఆరు వారాల ఎపిసోడ్లకు మాత్రమే కరణ్ హోస్టుగా ఉంటాడనీ, అనంతరం 'కలర్స్' టీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్లకు మాత్రం మళ్లీ యథావిధిగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తాడని సమాచారం. రెమ్యూనరేషన్‌ తగ్గించుకునేందుకు ఈ ప్లాన్‌చేశారని టాక్.

Follow Us:
Download App:
  • android
  • ios