ఇంటిసభ్యులను మరోసారి ఏడిపించాడు బిగ్‌బా. ఆ మధ్య తమ చిన్ననాటి గుర్తులను ఫోటో రూపంలో చూపించి కన్నీళ్ళు పెట్టించారు. అలాగే తమని కదిలించిన సంఘటనలు పంచుకోవాలన్నప్పుడు మరోసారి ఎమోషనల్‌ అయ్యారు సభ్యులు. తాజాగా మరోసారి ఏడిపించాడు. బిగ్‌బాస్‌4, 49వ రోజు దసరా స్పెషల్‌ ఈవెంట్‌లో భాగంగా తమ ఫ్యామిలీ సభ్యుల వీడియోలను చూపించి భావోద్వేగానికి గురయ్యేలా చేశారు. యాభై రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూసుకుని ఇంటిసభ్యులు ఎమోషనల్‌ అయ్యారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు. 

మరోవైపు ఈ వారం ఎలిమినేషన్‌ లేదని అంతా భావించారు. కానీ అందరికి ట్విస్ట్ ఇస్తూ ఎలిమినేషన్‌ ప్రక్రియని చేపట్టింది హోస్ట్ సమంత. ఇందులో ఏడోవారం ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. దసరా స్పెషల్‌ దివికి కలిసి రాలేదనే చెప్పాలి. ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేట్‌ ప్రక్రియలో అరియానా, అభిజిత్‌, మోనాల్‌, నోయల్ సేఫ్‌ అయ్యారు. ఉత్కంఠభరిత గేమ్‌ మధ్య అవినాష్‌, దివి ఎలిమినేట్‌ పోటీ పెట్టారు. ఇద్దరు తాడు లాగినప్పుడు ఎవరిపై ఎరుపు పూలు పడతాయో వారు ఎలిమినేట్‌ అనగా, దివిపై ఎరుపు పూలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా దివికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. 

దివి ఎలిమినేట్‌ అవుతుందంటే అమ్మా రాజశేఖర్‌ కన్నీళ్ళు పెట్టుకున్నారు. చాలా సేపు ఆయన ఎమోషనల్‌ అయ్యారు. దివి వెళ్తుందంటే తట్టుకోలేకపోయారు. ఆమెకి ఏదో తినిపించాడు. ఈ సందర్భంగా దివి స్పందిస్తూ అమ్మా రాజశేఖర్‌ తనకు అమ్మలాగా అని, తనని హౌజ్‌లో అలా చూసుకున్నారని, చాలా మిస్‌ అవుతున్నట్టు తెలిపింది. దివి పోతూ పోతూ.. లాస్యపై బిగ్‌బాంబ్‌  వేసింది. నెక్ట్స్ వారం మొత్తం వంట చేయాలనేది బిగ్‌బాంబ్‌ కండీషన్‌.