బిగ్‌బాస్‌ ఇండియాలో బాగా పాపులర్‌ అయ్యింది. మొదట అది హిందీలో ఆదరణ పొందింది. బాగా క్లిక్‌ అయ్యింది. దీంతో దక్షిణాది భాషలకు అది విస్తరించింది. గత నెలలో తెలుగులో బిగ్‌బాస్‌ 4 పూర్తయిన విషయం తెలిసిందే. ఇక హిందీలో ఇంకా కొనసాగుతుంది. అక్కడ ప్రస్తుతం 14వ సీజన్‌ నడుస్తుంది. సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  తాజాగా హౌజ్‌లో కండల వీరుడు సల్లూభాయ్‌ కన్నీరు పెట్టుకున్నారు. ఓ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అయితే తాను ఎమోషనల్‌ అయిపోయాడు. 

జాస్మిన్‌ అనే లేడీ కంటెస్టెంట్‌ ఈ వారం ఎలిమినేట్‌ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆమె ఎలిమినేట్‌ కావడంతో ఇంటి సభ్యులు మొత్తం కన్నీరు పెట్టుకున్నారు. ఇన్నాళ్లు కలిసి ట్రావెల్‌ చేసిన సహ సభ్యురాలు వెళ్లిపోతుండటంతో సభ్యులంతా ఎమోషనల్‌ అయ్యారు. వారిని చూసి సల్మాన్‌ సైతం కన్నీరు పెట్టుకున్నారు. స్టేజ్‌పైనే ఆయన కళ్లలోంచి నీరు కారాయి. హౌజ్‌లో సల్మాన్‌.. జాస్మిన్‌ విషయంలో సల్మాన్‌ అటెన్షన్‌ కలిగి ఉన్నారని, అందుకే ఆమె ఎలిమినేట్‌ కావడంతో సల్మాన్‌ ఎమోషనల్‌ అయ్యారని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. హిందీలో `బిగ్‌బాస్‌` కలర్స్ టీవీ ఛానెల్‌లో ప్రసారమవుతుంది.

ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ `రాధే` చిత్రంలో నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌. ఇది చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకుంది.