స్వల్ప  లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి పేర్కొంది. దీంతో అభిమానులు  స్పందిస్తూ ఆమెకి ధైర్యాన్నిస్తున్నారు. జాగ్రత్తగా  ఉండాలని కోరుతున్నారు.

`బిగ్‌బాస్‌ 5` ఫేమ్‌ సిరి(Biggboss5 Siri)) హన్మంత్‌ కరోనా బారిన పడ్డారు. తాజాగా తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా వెల్లడించింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి పేర్కొంది. దీంతో అభిమానులు స్పందిస్తూ ఆమెకి ధైర్యాన్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఆమెకి బరోసాగా నిలుస్తున్నారు. Siri బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌తో పాపులర్‌ అయ్యింది సిరి. యూట్యూబర్‌గా పాపులర్‌ అయిన ఈ భామ `బిగ్‌బాస్‌`లోకి వచ్చాక యమ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 

ముఖ్యంగా షణ్ముఖ్‌తో కలిసి ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు, బోల్డ్ అండ్‌ బ్యూటీఫుల్‌ అనేలా బుల్లితెర రియాలిటీ షోలో కనువిందు చేసింది. షోలో టాప్‌ 5గానూ నిలిచింది సిరి. సన్నీకి దీటుగా పోరాడి తన సత్తాని చాటుకుంది. హౌజ్‌లో షణ్ముఖ్‌తో ఎమోషనల్‌గానూ బాగా కనెక్ట్ అయి ఆకట్టుకుంది. అయితే హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక మాత్రం షణ్ముఖ్‌ ప్రియురాలు దీప్తి సునైనా, షణ్ముఖ్‌ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. షణ్ముఖ్‌, దీప్తి తమ లవ్‌కి బ్రేకప్‌ చెప్పుకున్న విషయం తెలిసిందే. హౌజ్‌లో షణ్ముఖ్‌తో సిరి క్లోజ్‌గా మూవ్‌ కావడం వల్లే దీప్తి విడిపోయిందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు. దీనిపై స్పందించిన సిరి ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. వారి బ్రేకప్‌కి తాను కారణం కాదని తెలిపింది. 

మరోవైపు కరోనా దేశంలో విజృంభిస్తోంది. రోజుకి మూడు లక్షల వరకు కేసులు నమోదవుతున్నాయి. సెలబ్రిటీలు సైతం భారీగా కరోనా బారిన పడుతున్నారు. సినీ సెలబ్రిటీల్లో టాలీవుడ్‌లో ఇప్పటికే మహేష్‌బాబు, కీర్తిసురేష్‌, థమన్‌, మంచు మనోజ్‌, బండ్ల గణేష్‌, రాజేంద్రప్రసాద్‌ వంటి ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు.