మానస్‌ టాప్‌ 5లో నిలవగా, రెండు వారాల ముందే ప్రియాంక ఎలిమినేట్‌ అయ్యింది. కానీ అందరి హృదయాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమెకి సినిమా ఆఫర్‌ వచ్చింది. 

`జబర్దస్త్`తో పాపులర్‌ అయిన ప్రియాంక సింగ్‌(Priyanka Singh).. గత బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మెరిసింది. ఇందులో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్‌ 5(Bigg Boss 5) హౌజ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్‌ లేడీగా ఆకట్టుకుంది. అంతేకాదు అత్యంత పులిహోర కలిపిన కంటెస్టెంట్‌గానూ నిలిచింది. మానస్‌పై ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తూ హౌజ్‌కి గ్లామర్‌ని తీసుకొచ్చింది. మానస్‌, పింకీల బిగ్‌బాస్‌ లవ్‌ స్టోరీ హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఐదోసీజన్‌ పూర్తయ్యేంత వరకు వీరి గురించిన చర్చే జరిగింది. హౌజ్‌లో మానస్‌ వెంట పడటం పట్ల నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. పింకీ ప్రవర్తన విసుగు తెప్పించేలా ఉందనే కామెంట్లు వినిపించాయి. 

అయితే మానస్‌ టాప్‌ 5లో నిలవగా, రెండు వారాల ముందే ప్రియాంక ఎలిమినేట్‌ అయ్యింది. కానీ అందరి హృదయాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమెకి సినిమా ఆఫర్‌ వచ్చింది. ప్రముఖ నిర్మాత, రచయిత కోనవెంకట్‌.. ప్రియాంకకి సినిమా ఆఫర్‌ ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించి కథా చర్చలు జరగడంవిశేషం. ఈ విషయాన్ని ప్రియాంక సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

Scroll to load tweet…

కోన వెంకట్‌తో దిగిన ఫోటోని పంచుకుంటూ, `త్వరలో ఓ ఎగ్జైట్‌మెంట్‌తో రాబోతున్నా. కోన వెంకట్‌తో టైమ్‌ స్పెండ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది` అని పేర్కొంది ప్రియాంక సింగ్‌. అయితే ఈ సినిమాకి సంబంధించి డిటెయిల్స్ మాత్రం ప్రకటించలేదు ప్రియాంక. త్వరలోనే ఆ వివరాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రియాంక అసలు పేరు సాయితేజ్‌. జబర్దస్త్ షోలో కమెడీయన్‌గా పాల్గొని ఆకట్టుకున్నారు. లేడీ గెటప్స్ తో ఆకట్టుకున్న సాయితేజ.. లింగ మార్పిడి చేసుకున్నారు. లేడీగా మారిపోయారు. ప్రియాంక సింగ్‌గా పేరు మార్చుకున్నారు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ 5 షోలో పాల్గొని మరింత పాపులర్‌ అయ్యింది.