వెయ్యి స్థంబాల గుడికి వెళ్లి అక్కడ గాజులు ఇచ్చి ప్రపోజ్‌ చేశానని తెలిపాడు. మరోవైపు తనకు హీరో అవ్వాలని ఉండేదని, చివరికి డాన్స్ మాస్టర్‌ అయ్యానని తెలిపాడు. హీరోగా చిరంజీవి ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పాడు. నాగార్జునని కలిసేందుకు 22ఏళ్లు వెయిట్‌ చేశానని, ఇప్పుడు ఫైనల్‌గా కుదిరిందని తెలిపాడు. నటరాజ్‌ 12వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వచ్చాడు.

ఒంటరిగా ఎదిగాడు డాన్స్ మాస్టర్ నటరాజ్‌. ప్రస్తుతం సౌత్‌లో పాపులర్‌ డాన్స్ మాస్టర్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌5లోకి ఎంట్రీ ఇచ్చాడు నటరాజ్‌. తన భార్య సెనోరిటా ఇప్పుడు 7నెలల ప్రెగ్నెంట్‌. కానీ బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడు. అనంతమైన బాధతో, అనంతరమైన సంతోషంతో వెళ్తున్నట్టు చెప్పాడు. ఎందుకంటే బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లడం ఆయన డ్రీమ్‌. ఎన్నాళ్లుగానో కోరుకున్నాడు. కరెక్ట్ గా తన భార్య ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి కాల్‌ వచ్చింది. మొదట నో చెప్పాడు. కానీ రెండు రోజులు భార్య సెనోరిటా ఫైట్‌ చేయడంతో ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. 

 ఇప్పుడు ఆయన భార్య ఏడు నెలల ప్రెగ్నెంట్‌. బిగ్‌బాస్‌ పూర్తయ్యే సరికి ఆమె డెలివరీ అవుతుంది. దీంతో డెలివరీ టైమ్‌లో తాను ఉండలేకపోతున్నందుకు బాధగా ఉందని ఎమోషనల్‌ అయ్యారు నటరాజ్‌. చివరి సారిగా తన భార్య బేబీ బమ్స్ ని హగ్‌ చేసుకుని, బేబీ కదలికలు ఆస్వాదించి అందరిని కదిలించాడు నటరాజ్‌. అంతేకాదు ఈ సందర్భంగా తన లవ్‌ స్టోరీ చెప్పాడు. తాను ఒంటరిగా ఎదిగానని, కానీ తనని ఓ అమ్మాయి ఏడేళ్లుగా ప్రేమిస్తుందని, ఆమెని తాను పట్టించుకోవడం లేదని, ఏడేళ్ల తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్నానని తెలిపారు. 