బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం నాడు మొదలైన సంగతి తెలిసిందే. మొదటిరోజు హౌస్ లో కూల్ గా గడిచిపోతుందని భావించిన హౌస్ మేట్స్ కి నిరాశే ఎదురైంది. వచ్చినరోజే ఎలిమినేషన్ రౌండ్ పెట్టి షాక్ ఇచ్చారు బిగ్ బాస్. పదిహేను మంది కంటెస్టంట్స్ లో ఆరుగురు రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు, శ్రీముఖి, బాబా భాస్కర్‌, జాఫర్‌ లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

అయితే దాని నుండి అందులోంచి తప్పించుకునే అవకాశాన్ని కూడా కల్పించాడు. ఒక మానిటర్ ని ఎన్నుకొని నామినేట్‌ అయినఒక సభ్యుడు మిగిలిన ఇంటిసభ్యుల్లోంచి ఒకరిని తనకు బదులుగా.. సరైన కారణాలను చెప్పి రీప్లేస్‌ చేయవచ్చునని బిగ్‌బాస్‌ తెలిపాడు. ఈ క్రమంలో మంగళవారం నాడు ఎపిసోడ్ లో వరుణ్ తేజ్ తనకు బదులుగా పునర్నవిని నామినేషన్ కి రీప్లేస్ చేయగా మానిటర్ దానికి అంగీకరించారు.

అలానే శ్రీముఖి తనకు బదులుగా హిమజని నామినేట్ చేస్తూ కొన్ని కారణాలు చెప్పింది. హిమజ ప్రతీ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంటుందని.. బిగ్ బాస్ షో విషయంలో కూడా అలానే ఉంటుందనే అర్ధం వచ్చేలా మాట్లాడడంతో హిమజ హర్ట్ అయింది. దీంతో తన వెర్షన్ ని చెబుతూ శ్రీముఖిపై ఫైర్ అయింది. తన వ్యక్తిగత జీవితం గురించి శ్రీముఖికి ఏం తెలియకుండా కామెంట్ ఎలా చేస్తుందని ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది.

శ్రీముఖి.. హిమజకి సారీ చెప్పినా ఆమె మాత్రం తట్టుకోలేకపోయింది. ఆ తరువాత బిగ్ బాస్ హిమజని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మాట్లాడగా.. అప్పుడు కూడా ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. ఇక ఈ వారం నామినేషన్ కి ఎలిమినేట్ అయిన వారు రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమఅని బిగ్ బాస్ ప్రకటించారు.