బిగ్ బాస్2: తనీష్, దీప్తి కెప్టెన్ గా గెలిచేదెవరు..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Aug 2018, 6:11 PM IST
bigg boss2: who will win captaincy task
Highlights

ఒకరిపై ఒకరు పడిపోయి మరీ గోడకి రంగుని అద్దుతున్నారు. మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది. సోషల్ మీడియాలో మాత్రం దీప్తి సునయన.. తనీష్ నే ఎంపిక చేస్తుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి

బిగ్ బాస్ సీజన్ ఇప్పటికే 60 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ప్రతివారంలానే ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ జరుగుతోంది. 'అంతిమయుద్ధం' టాస్క్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దీప్తి, తనీష్ లను కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనమని 'రంగు రబ్బా.. రబ్బా' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సంచాలకులను ఇంటి సభ్యులే ఎన్నుకోవాలి. ఆ వ్యక్తిదే తుది నిర్ణయం అంటూ బిగ్ బాస్ నియమం పెట్టారు.

దీంతో హౌస్ మేట్స్ ఎవరిని పెడితే బాగుంటుందని ఆలోచిస్తోన్న సమయంలో నేను ఉంటునని చేతులు ఎత్తింది దీప్తి సునయన. ఈ టాస్క్ లో తనీష్, దీప్తి నల్లమోతు ఓ గోడకు పెయింట్ వేయడంలో పోటీ పడాలి. వీరిద్దరి మధ్య గోడ కోసం పోటీ గట్టిగానే జరిగినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో బట్టి తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పడిపోయి మరీ గోడకి రంగుని అద్దుతున్నారు.

మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది. సోషల్ మీడియాలో మాత్రం దీప్తి సునయన.. తనీష్ నే ఎంపిక చేస్తుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.   

 

loader