బిగ్ బాస్ సీజన్ 2 ఈవారం రసవత్తరంగా సాగనుందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఇందులో భాగంగా హౌస్ లోని కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు తమకి ఇష్టమైన వారు ఎన్నుకొని వారి పక్కన కూర్చోవాలని సూచించారు. అమిత్ కి రెండు వారాల పాటు ఎలిమినేషన్ ఛాన్స్ లేకపోవడంతో తను, కెప్టెన్ అయిన కారణంగా తనీష్ ఈ నామినేషన్స్ నుండి తప్పించుకున్నారు. వీరిద్దరూ పక్కకి రాగా, హౌస్ లో మొత్తం ఐదు జంటలు మిగిలాయి. ఒక్కో జంటలోని కంటెస్టెంట్ తాను ఎందుకు నామినేషన్స్ లో ఉండకూడదో..? తన పక్కన ఉన్న కంటెస్టెంట్ ఎందుకు ఉండాలో..? చెప్పాలని సూచించారు.

అలా వచ్చిన జంటల్లో సామ్రాట్, పూజా రామచంద్రన్ లలో సామ్రాట్ సేవ్ అయ్యాడు. కౌశల్, గీతా మాధురిలలో కౌశల్ సేవ్ అయ్యాడు. రోల్ రైడా, గణేష్ లలో గణేష్ సేవ్ అయ్యాడు. శ్యామల, దీప్తి సునైనాలలో శ్యామల సేవ్ అయింది. నూతన్ నాయుడు, దీప్తిలలో దీప్తి సేవ్ అయింది. ఫైనల్ గా కెప్టెన్ తనీష్ ని సేవ్ అయిన వారిలో ఒకరిని నామినేట్ చేయమని అడగగా తనీష్.. శ్యామల పేరు చెప్పాడు. అలా ఈ వారం నామినేషన్స్ లో పూజా రామచంద్రన్, గీతామాధురి, రోల్ రైడా, దీప్తి సునైనా, నూతన్ నాయుడు, శ్యామల నిలిచారు. అయితే ఈ వారంలో బయటకి వెళ్లేది దీప్తి సునైనా.. అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న గీతామాధురి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. శ్యామల, నూతన్ నాయుడు ఇటీవలే హౌస్ లోకి వచ్చారు కాబట్టి వారు కూడా వెళ్లే అవకాశం లేదని చెప్పొచ్చు. పూజాకి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది కాబట్టి ఆమె కూడా హౌస్ లో ఉండే అవకాశం ఉంది. దీప్తి సునైనా కంటే రోల్ రైడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి సునైనా బయటకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. కౌశల్ ఆర్మీ కూడా సోషల్ మీడియాలో దీప్తి సునైనానే నెక్స్ట్ టార్గెట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సునైనాకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి!