బిగ్ బాస్ సీజన్ 2 లో వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ కోసం ఇచ్చిన ఫిజికల్ టాస్క్ లో కొందరికి దెబ్బలు తగిలాయి. తాజాగా బిగ్ బాస్ మరో ఫిజికల్ టాస్క్ ను హౌస్ మేట్స్ కి ఇచ్చారు. 'పురుషులకి, మహిళలకి మధ్య అంతిమ యుద్ధం' అనే పేరుతి ఇచ్చిన ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ పోటీ పడి మరీ పాల్గొన్నారు. టాస్క్ లో భాగంగా పూజా రామచంద్రన్.. కౌశల్ పై విరుచుకుపడింది.

'డోంట్ టాక్ కౌశల్' అంటూ మండిపడింది. అంతేకాకుండా 'శ్యామల మనం టాస్క్ ఆడుతోంది కౌశల్ తో కాదు నీకు అర్ధమవుతోందా..?' అంటూ ఆమెపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన పూజా ఇప్పటివరకు ఎలాటి వివాదాల జోలికి వెళ్లలేదు. కౌశల్ ని మిగిలిన హౌస్ మేట్స్ అందరూ దూరం పెట్టినట్లుగా అనిపించినా.. పూజా మాత్రం అతడితో చాలా స్నేహంగా ఉంటూ వస్తోంది.

కొన్ని విషయాల్లో కౌశల్ కి తన సపోర్ట్ అందించింది. కానీ ఇప్పుడు టాస్క్ లో ఆమె కౌశల్ పై అరవడంతో వార్తల్లో నిలిచింది. నిన్నటి ఎపిసోడ్ టాస్క్ లో ఆమె సరిగ్గా రాణించలేకపోయిందనే అసహనాన్ని ఈ విధంగా వెళ్లగక్కిందని అంటున్నారు.