బిగ్ బాస్2: హౌస్ లోకి తేజస్వి, శ్యామల కాదు.. నూతన్ నాయుడు రీఎంట్రీ

bigg boss2: nutan naidu re entry into house
Highlights

ఊహించని విధంగా నూతన్ నాయుడు హౌస్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈరోజు ఎపిసోడ్ లో నాని ఇదే విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. హౌస్ లోకి వచ్చిన రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ కు సోషల్ మీడియాలో అభిమానులు బాగా పెరిగారు. 

బిగ్ బాస్ సీజన్ లో ఏదైనా జరగొచ్చు అంటూ ట్యాగ్ లైన్ కు తగ్గట్లే హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తేజస్వి ఉన్నంత వరకు ఏదొక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఆమె వెళ్లిన తరువాత హౌస్ కొంచెం కూల్ అయిందన్న సమయంలో అందరూ కలిసి కౌశల్ ను టార్గెట్ చేసిన విషయాలు వివాదానికి దారి తీశాయి. అది కూడా సద్దుమణిగింది అనుకునేలోపు బాబు గోగినేని, గీతామాధురిని టార్గెట్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది.

ఆయన మాటల కారణంగా గీతామాధురి బాధ పడి కంటతడి పెట్టుకుంది. అయినా.. బాబు గోగినేని మాత్రం గీతాను, కౌశల్ ను ఇంటి నుండి ఎలా పంపాలా అనే ఆలోచిస్తున్నారు. ఇక హౌస్ లో రీఎంట్రీగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఆరుగురిలో ఒకరిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్. ముందుగా తేజస్విని హౌస్ లోకి తీసుకురావడం కోసం ఇలా చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఆన్ లైన్ పోల్ లో శ్యామలకు ఎక్కువ ఓట్లు వస్తుండడంతో ఆమె రీఎంట్రీ ఇస్తుందని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఊహించని విధంగా నూతన్ నాయుడు హౌస్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈరోజు ఎపిసోడ్ లో నాని ఇదే విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. హౌస్ లోకి వచ్చిన రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ కు సోషల్ మీడియాలో అభిమానులు బాగా పెరిగారు. ఆయన కూడా అదే ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగించుకొని ఎక్కువ ఓట్లు సాధించారని సమాచారం. మరి ఆయన రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి!

loader