బిగ్ బాస్2: తనీష్ చేసిన పని కౌశల్ చేసి ఉంటే..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 11, Aug 2018, 11:12 AM IST
bigg boss2: netizens trolling tanish and babu gogineni
Highlights

 తనీష్ చేసిన పనే కౌశల్ చేసి ఉంటే హౌస్ మొత్తం ఏకమయ్యి కౌశల్ ని టార్గెట్ చేసి మరింత దూషించేవారని కౌశల్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు

ఈ వారం కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన టాస్క్ లో తనీష్, దీప్తిలు పోటీ పడగా ఫైనల్ గా సంచలకురాలు దీప్తి సునయన .. తనీష్ ని విజేతగా ప్రకటించింది. తనీష్ ఎన్నుకున్న కలర్ రెడ్ కావడంతో గోడ మొత్తం ఆ కలర్ డామినేట్ చేసేసింది. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయాన్ని చెప్పాలని కౌశల్.. దీప్తి సునయనను రిక్వెస్ట్ చేసినా.. సునయన మాత్రం తన కాల్క్యులేషన్స్ ప్రకారం తనీష్ పేరే చెప్పింది.

విజేత ఎవరనే విషయాన్ని పక్కన పెడితే.. గేమ్ ఆడే సమయంలో తనీష్.. దీప్తి నల్లమోతుని ఫిజికల్ గా అడ్డుకున్నారు. ఆమెను గోడకు రంగు వేయనివ్వకుండా తన బలం మొత్తం ఉపయోగించి ఆపేశారు. దీప్తి ఎంతగా కష్టపడినా తనీష్ బారి నుండి విడిపించుకోలేకపోయింది. మగాళ్లతో ఆడవాళ్లకు ఫిజికల్ గేమ్ లు పెట్టడం ఏంటని దీప్తి కాస్త ఎమోషనల్ అయింది. వెంటనే తనను తాను సముదాయించుకొని నార్మల్ అయిపోయింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కౌశల్ అభిమానులు తనీష్ చేసిన పనిని తప్పుబడుతున్నారు.

తనీష్ చేసిన పనే కౌశల్ చేసి ఉంటే హౌస్ మొత్తం ఏకమయ్యి కౌశల్ ని టార్గెట్ చేసి మరింత దూషించేవారని కౌశల్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఆడవాళ్ల విషయంలో పురుషల పురుషుల ఆగడాలు అని మాట్లాడే బాబు గోగినేని ఇప్పుడు తనీష్ విషయంలో ఎందుకు మాట్లాడలేదు, ఆయన శిష్యుడు కాబట్టి వదిలేశారా..? అదే కౌశల్ ఉండి ఉంటే పెద్ద సీన్ చేసి ఉండేవారంటూ మండిపడుతున్నారు. నిజమేమరి కౌశల్ గనుక దీప్తిని ఫిజికల్ గా అడ్డుకొని ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో!

loader