బిగ్ బాస్ సీజన్ 2 మొదలై నాలుగు వారాలు పూర్తయింది. వారానికి ఒకరు చొప్పున ఇప్పటికే నలుగురు కంటెస్టంట్లు ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. మధ్యలో షోని కలర్ ఫుల్ గా చేయడం కోసం నందిని రాయ్ అనే హీరోయిన్ ను రంగంలోకి దింపారు. కానీ ఆమె కారణంగా షోకి ఎలాంటి ఎట్రాక్షన్ యాడ్ కాలేదు. మొదటి సీజన్ లో దీక్షా పంత్ మాదిరి నందిని రాయ్ ఈ షోకి గ్లామర్ తెస్తుందని అనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు.

ఇప్పుడు మరో హాట్ హీరోయిన్ ను ఈ షోలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదూ.. 'కుమారి 21 ఎఫ్' ఫేమ్ హెబ్బా పటేల్. వెండితెరపై ఎంతో గ్లామరస్ గా కనిపించే హెబ్బాను ఈ షోకి తీసుకురావడం ద్వారా యూత్ ను ఎట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉందని భావించిన నిర్వాహకులు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ ఈ విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సినిమాల పరంగా హెబ్బాకు పెద్ద బిజీగా లేదనే చెప్పాలి. ఆమె నటించిన '24 కిసెస్' సినిమా షూటింగ్ పూర్తయింది.

ఇక హెబ్బా చేతిలో మరో సినిమా లేదు. ఈ క్రమంలో ఆమెకు గనుక ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే షోలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సీజన్ మొదలైన ఆరంభంలో షోపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపించేవి. వాటిని అధిగమించి షోపై రోజురోజుకి ఆసక్తి పెరిగే విధంగా టాస్క్ లను డిజైన్ చేస్తున్నారు. మరి హెబ్బా రాక ఈ షోపై మరింత  హైప్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి!