బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దొంగలు, ఊరి పెద్దలు, పోలీసుల నేపధ్యంలో ఈ టాస్క్ జరుగుతోంది. ఇక ఈ కెప్టెన్ టాస్క్‌ను తొలి నుండి సాఫ్ట్‌గా ఆడుతున్న యాంకర్ శ్రీముఖి పర్సనల్ ఎటాక్ చేయకపోతే గేమ్ గెలవడం కష్టమని భావించి డంబెల్ తో నిధి అద్దాలను పగలగొట్టాలని నిర్ణయించుకొని అంత పనీ చేసింది. 

చుట్టూ  వరుణ్, వితికా, తమన్నా, మహేష్‌లు కాపలా ఉన్నా ధైర్యం చేసి డంబెల్‌తో నిధి అద్దాలను పగలగొట్టింది. ఇక అప్పుడే జైలు నుండి వచ్చిన రవిని సైతం పగలగొట్టమమని శ్రీముఖి సలహా ఇవ్వడంతోఅతను చేతితో అద్దాలను పగలగొట్టడంతో అతని చేతికి గాయమై రక్తం కారింది. శ్రీముఖి డంబెల్ తో అడ్డం పగలగొట్టమని రవికి చెబితే అతడు మాత్రం చేతితో పగలగొట్టాడు.

అయితే రవికి గాయం కావడానికి కారణం శ్రీముఖి అంటూ వితికా, రాహుల్ లు ఆమెపై ఎటాక్ చేశారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కూడా ఈ టాస్క్ కంటిన్యూ అవుతుంది. తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. ఇందులో బిగ్ బాస్ శ్రీముఖికి వార్నింగ్ ఇస్తున్నారు. 

హౌస్ నియమాలు ఉల్లఘించిన కారణంగా శిక్షగా శ్రీముఖిని ఇంటి నుండి బయటకి పంపడానికి అంటూ ప్రోమోని ఎండ్ చేశారు. నిజంగానే శ్రీముఖిని ఇంటి నుండి బయటకి పంపుతారా..? లేక ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా..? అనేది ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది!