బిగ్ బాస్ సీజన్ 3లో మంగళవారం రోజు జరిగిన ఎపిసోడ్ ప్రతి ఒక్కరిని అలరించింది. ఈ సీజన్ ఆరంభంలో బోర్ కొట్టించిన సెలబ్రిటీ కపుల్స్ వరుణ్, వితిక ప్రస్తుతం ఆకట్టుకునే విధంగా గేమ్ ఆడుతున్నారు. సోమవారం జరిగిన ఎపిసోడ్ లో భాగంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు రాహుల్, వరుణ్ సందేశ్, పునర్నవి, హిమజ, మహేష్, రవి నామినేట్ అయ్యారు. 

కాగా మంగళవారం రోజు నామినేట్ అయిన వారిలో ముగ్గురిని సేవ్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించారు. కష్టతరమైన టాస్క్ లని బాగా పెర్ఫామ్ చేసిన వరుణ్, రవి, రాహుల్ సేవ్ అయ్యారు. ఈ టాస్క్ లో వరుణ్, వితిక జంట అందరి దృష్టిని ఆకర్షించింది. అందరూ వితికనే టార్గెట్ చేశారు. అయినా కూడా వితిక స్పోర్టివ్ గా తీసుకుంది. చివరకు తన భర్త వరుణే తన డ్రెస్ చించేసినా, కాఫీ ముఖం మీద కొట్టినా కాస్త ఎమోషనల్ అయింది తప్ప సహనం కోల్పోలేదు. 

ఆ సమయంలో వరుణ్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. భార్య భర్తలిద్దరూ అటు గేమ్ ని, ఇటు రిలేషన్ ని చక్కగా ప్రదర్శించారనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆరంభంలో కొన్ని వారాల పాటు వరుణ్, వితిక జంట పట్ల ప్రేక్షకులను అసహనం వ్యక్తం చేశారు. కానీ గేమ్ లో సీరియస్ నెస్ పెరిగేకొద్దీ వారిలో మార్పు కనిపిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

కొన్నిసార్లు వితిక ఎమోషనల్ అయినా.. ఇది గేమ్ అని వరుణ్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. బిగ్ బాస్ లో వీరి ప్రయాణం చివరి వరకు కొనసాగుతుందో మధ్యలోనే బ్రేక్ అవుతుందో చూడాలి.