08:38 PM (IST) Oct 14

నామినేషన్స్: యష్మి వర్సెస్ హరితేజ

సోమవారం వచ్చిందంటే హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. గత వారం యష్మిని నామినేట్ చేసిన హరితేజ మరోసారి ఆమెను నామినేట్ చేసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. 

Scroll to load tweet…
07:56 PM (IST) Oct 14

నా పతనం అప్పుడే ప్రారంభమైందిః కిర్రాక్‌ సీత

ఈ వారం కిర్రాక్‌ సీత ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. బిగ్‌ బాస్‌ బజ్‌లో ఆమె మాట్లాడుతూ తన పతనం ఎప్పుడు ప్రారంభమైందో తెలిపింది. తాను కెప్టెన్ అయ్యాకనే తన డౌన్‌ఫాల్‌ స్టార్ట్ అయ్యిందని చెప్పింది. బాధ్యతల వల్ల గేమ్‌ ఆడలేదని, తన ఫ్రెండ్స్ కోసమని తాను త్యాగం చేశానని, అలా తాను డౌన్‌ అయినట్టు చెప్పింది సీత. 

YouTube video player

07:06 PM (IST) Oct 14

ప్రేరణను ఈ రేంజ్ లో ఎవరూ పొగిడి ఉండరు!

అవినాష్ గొప్ప ఎంటర్టైనర్ అనడంలో సందేహం లేదు. నన్ను చూస్తూ ఎందుకు మాట్లాడుతున్నావ్, అన్న ప్రేరణను తన మాటలతో ఐస్ చేశాడు అవినాష్. ఇంత అందంగా ఎందుకు పుట్టావ్? అంటూ బిస్కెట్స్ వేశాడు. ప్రేరణను ఈ రేంజ్ లో ఎవరూ పొగిడి ఉండరు. 

Scroll to load tweet…
06:34 PM (IST) Oct 14

నామినేషన్స్ డే: నాగ మణికంఠ వర్సెస్ నిఖిల్

గత వారం నీ గ్రాఫ్ పడిపోయిందని కారణం చెప్పి నిఖిల్ ని నామినేట్ చేసే ప్రయత్నం చేశాడు నాగ మణికంఠ. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

YouTube video player

06:27 PM (IST) Oct 14

నామినేషన్స్ లో బరస్ట్ అయిన అవినాష్

నామినేషన్స్ డే వేళ బిగ్ బాస్ హౌస్ మరోసారి హీటెక్కింది. అశ్వద్ధామ 2.0 మేటర్ తెరపైకి వచ్చింది. నాకు నచ్చని విషయం మాట్లాడి రెచ్చగొట్టారని గౌతమ్ అన్నాడు. తెలియక అన్నాను అంటూ అవినాష్ ఫైర్ అయ్యాడు.   

 

YouTube video player

10:33 AM (IST) Oct 14

బిగ్ బాస్ లో ఈవారం నామినేషన్స్ లిస్ట్

విశ్వసనీయ సమాచారం మేరకు ఈవారం ఏకంగా 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు.నామినేషన్స్ లో ఉన్న వారి వివరాలు ఇవే. నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్, నాగమణికంఠ, యాష్మి, నబీల్, ప్రేరణ, హరితేజ, టేస్టీ తేజ నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళని ఎవరు, ఎలాంటి పాయింట్స్ తో నామినేట్ చేశారో చూడాల్సి ఉంది. అయితే వీరిలో కొందరు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్లు సమాచారం. 

బిగ్ బాస్ లో ఈవారం నామినేషన్స్ లిస్ట్ ?..డేంజర్ జోన్ లో ఉన్నది అతడే..

06:28 AM (IST) Oct 14

హౌస్ లో హస్బెండ్ మెటీరియల్ ఎవరో చెప్పిన సీత

కిరాక్ సీత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె వెళుతూ వెళుతూ హౌస్ లో కొందరిపై కీలక వ్యాఖ్యలు చేసింది. మెహబూబ్ అంటే తనకి ఇష్టం అన్నట్లుగా కామెంట్స్ చేసింది. అతడు టైటిల్ గెలవాలని కోరింది. ఇక నిఖిల్ అయితే హస్బెండ్ మెటీరియల్ అని తెలిపింది. మెహబూబ్ కూడా కాస్త ఎమోషనల్ గానే రియాక్ట్ అయ్యాడు. మీ తండ్రికి నువ్వు ఇవ్వాలనుకున్న బైక్ ని తాను గిఫ్ట్ గా ఇస్తానని మాట ఇచ్చాడు. సీత ఎలిమినేట్ కావడంతో విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయింది.