Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌస్ లో ఘోస్ట్ గేమ్ ఆడించిన నాగార్జున, సోనాల్ కళ్లకు శ్రీహాన్ ఫిదా, హౌస్ లో రాక్షసులెవరంటే..?

బిగ్ బాస్ ఈ సండే  పండగ  సందడితో స్టార్ట్ అయ్యింది. పాటలు,ఆటలు, డాన్స్ లు, గెస్ట్ లతో డబుల్ డోస్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది. ఈ సండే హౌస్ మెంట్స్ తో పాటు.. ఆడియన్స్ కు కూడా కనువిందునిచ్చారు బిగ్ బాస్ మేకర్స్. ఇక స్పెషట్ గాఘోస్ట్ గేమ్ తో సందడి చేశారు. 

Bigg Boss Telugu Season 6 Dasara Special
Author
First Published Oct 2, 2022, 7:36 PM IST


బిగ్ బాస్ ఈ సండే  పండగ సంబరాలతో అద్భుతమైన ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. మేకర్స్. చప్పగా ఉంటుంది అన్న విమర్షల నుండి బయట పడటానికి సంబరాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈవెంట్ లోఫస్ట్ గెస్ట్ గా ఘోస్ట్ టీమ్ ఎంటర్ అయ్యారు. హీరోయిన్ సోనాల్ చౌహాన్ తో పాటు.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కూడా ఈవెంట్ లో జాయిన్ అయ్యారు. ముందుగా నాగార్జున చంటీకి- కీర్తికి మధ్య జరుగుతున్న డిస్ట్రబెస్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వీడియోలు ప్లే చేసి.. చంటిని నిర్థోషిగా తేల్చారు. ఈ క్రమంలో ఎక్కువగా మాట్లాడుతున్న గీతుకు వార్నింగ్ కూడా ఇచ్చారు నాగార్జున. 

ఇక హౌస్ లో ఘోస్ట్ ఎవరు అన్న గేమ్ తో ఈవెంట్ ను స్టార్ట్ చేశారు నాగార్జున. ప్రతీ ఒక్కరూ సేఫ్ గేమ్ ఆడాలని ప్రయత్నించగా.. గీతూ మాత్రం చంటీని టార్గెట్ చేసింది. ఇక హౌస్ లోచాలా మంది.. చంటిని అపార్దం చేసుకున్నందుకు  కీర్తిని టార్గెట్ చేస్తూ గన్ తో షూట్ చేసి.. ఘోస్ట్ గా తేల్చారు. ఇక బాలాదిత్యను సుధీప, ఇనయాను ఆరోహీ, ఆరోహీని సూర్య, శ్రీసత్యాను అర్జున్, మంచివారు అనే పేరు చెప్పి స్వీట్ ఘోస్ట్ అంటూ సేఫ్ గేమ్ ఆడారు. ఇక ఇయనాను శ్రీహాన్,  రేవంత్ ను కీర్తి సీరియస్ గా టార్గెట్ చేశారు. 

ఇక ఈవెంట్ లో సోనాల్ నవ్వు సెంటర్ అట్రాక్షన్ అయ్యింది. ఆమె నవ్వుతో పాటు.. కళ్ళు హౌస్ మెంట్స్ ను ఆకర్షించింది. ముఖ్యంగా సోనాల్ కళ్లకు  శ్రీహాన్ ఫిదా అయిపోయాడు. ఇక సిరీ చూస్తుందంటూ అందరు శ్రీహాన్ ను ఆటపట్టించారు. ఈ సందర్భంగా రేవంత్ అద్భుతమైన పాట పాడగా.. సూర్య తన మిమిక్రీ టాలెంట్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మధ్యలో  సూర్య-ఆరోహీ, అర్జున్-శ్రీసత్య ల లవ్ ను టీజ్ చేస్తూ.. నాగార్జున ఓ ఆట ఆడుకున్నాడు. హౌస్ ఇక హౌస్ లో నామినేషన్స్  లో ఉన్నవారిని ఒక్కొక్కరిగా సేవ్ చేస్తూ వస్తున్నారు. 

ఈ ఈవెంట్ లో తన ఘోస్ట్ మూవీని ప్రమోట్ చేసుకున్నారు నాగార్జున. ఈ సినిమా ట్రైలర్ ను హౌస్ మెంట్స్ కు చూపించారు. హౌస్ అంతా ఆల్ ది బెస్ట్ చెప్పగా.. నాగ్ కాసేపు సోనాల్ ను. ప్రవీన్ ను సెటైర్లతో ఆడేసుకున్నాడు. సినిమా రిలీజ్ కోసం టెన్షన్ గా ఎదురుచూస్తున్నానంటూ ప్రవీణ్ సత్తారు చెపుతూ.. లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటున్నాను అన్నాడు. ఇక నాగ్ లీడ్ తీసుకుని లీక్విడ్స్ అంటే అవేనా అంటూ సెటైర్ వేశాడు. ఇక సోనాల్ వచ్చి రావడంతోనే నాగార్జునను ఆకాశానికెత్తుతూ తెగ పొగిడేసింది. సినిమాలోనే కాదు బయట కూడా నాగ్ సార్ బెస్ట్ అన్నది. అంతే కాదు మీరు బెస్ట్ హోస్ట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది సోనాల్. 

Follow Us:
Download App:
  • android
  • ios