Asianet News TeluguAsianet News Telugu

BB Teglugu 7: హౌస్లో నువ్వు ఏం సాధించావ్ అమర్ కి భోలే స్ట్రైట్ క్వచ్చన్... నామినేషన్స్ లో మాటల యుద్ధం!

బిగ్ బాస్ షోలో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. హౌస్ మేట్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. మరోసారి భోలే-అమర్ దీప్ మధ్య యుద్ధం జరిగింది... 
 

bigg boss telugu 7 war of words between amar deep and bhole ksr
Author
First Published Oct 31, 2023, 12:15 PM IST

సోమవారం బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టాడు. ప్రతి హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేయబడ్డ హౌస్ మేట్ ముఖాన డ్రాగన్ స్నేక్ రంగు చిమ్ముతుంది. పల్లవి ప్రశాంత్... అమర్ దీప్, తేజాలను నామినేట్ చేశాడు. అనంతరం వచ్చిన ప్రియాంక.. రతిక, భోలేలను చేసింది. ఇక అర్జున్... అమర్, శోభా శెట్టిలను చేశాడు. శివాజీ... అమర్ దీప్, తేజాలను చేశాడు. రతిక సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభాలను చేసింది. తేజ... అర్జున్, రతికలను నామినేట్ చేశారు. భోలే... ప్రియాంక, అమర్ లను నామినేట్ చేశాడు.

మంగళవారం కూడా నామినేషన్స్ ప్రక్రియ జరగనుంది. కాగా యావర్... రతిక, అశ్వినిలను నామినేట్ చేశాడు. అశ్విని-యావర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భోలే తనని నామినేట్ చేసిన క్రమంలో అమర్ తిరిగి భోలేను నామినేట్ చేశాడు. నామినేషన్ కి నువ్వు చెప్పిన పాయింట్ సరిగా లేదు. అందుకే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. ఈ హౌస్లో నేను మంచి పేరు తెచ్చుకున్నాను... నువ్వు మాత్రం చెడ్డ పేరు తెచ్చుకున్నావు అన్నాడు. 

అవును నేను చెడ్డవాడినే నీకేమైనా ప్రాబ్లమా అంటూ అమర్ ఎదురు సమాధానం చెప్పాడు. ఈ హౌస్లో నువ్వు సాధించింది ఏమీ లేదని భోలే ఫైర్ అయ్యాడు. ఇకైనా మారు అని సలహా ఇచ్చాడు. నేను మారను అను అమర్ దీప్ సమాధానం చెప్పాడు. భోలే-అమర్ మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది. 

నేటి ఎపిసోడ్ తో ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారో తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం 8 మందిని నామినేట్ అయ్యారట. ఈ లిస్ట్ లో అర్జున్, అమర్, ప్రియాంక, శోభా, తేజా, భోలే, యావర్, రతిక ఉన్నారట. ఇక 8వ వారం సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. శోభా-సందీప్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా... సందీప్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు... 

Follow Us:
Download App:
  • android
  • ios