Bigg Boss Telugu 7: ముగుస్తున్న ఓటింగ్... డేంజర్ జోన్లో ఆ కంటెస్టెంట్, ఈసారి ఇంటికేనా?
బిగ్ బాస్ తెలుగు 7లో మరో ఎలిమినేషన్ కి రంగం సిద్ధం అవుతుంది. 8 మంది నామినేషన్స్ లో ఉండగా... ఓ ఇద్దరిపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతుంది.

బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ఫుల్ గా 8 వారాలు పూర్తి చేసుకుంది. 9వ వారం కూడా పూర్తి కావస్తుంది. వీకెండ్ వస్తుందంటే హౌస్ లో ఒకరికి మూడినట్లే. ఈ వారానికి 8 మంది హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. అమర్ దీప్, యావర్, భోలే, తేజ, శోభా, ప్రియాంక, అర్జున్, రతిక నామినేషన్స్ లో ఉన్నారు. మంగళవారం నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.
మొదటి నుండి యావర్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడికి 20 శాతానికి పైగా ఓట్లు పోలైనట్లు సమాచారం. రెండో స్థానంలో భోలే కొనసాగుతున్నాడట. ఇది ఊహించని పరిణామం. భోలే గ్రాఫ్ పెరిగిందనడానికి ఇది నిదర్శనం. ఇక సీరియల్ యాక్టర్ గా ఫ్యాన్ బేస్ ఉన్న అమర్ దీప్ మూడో స్థానంలో ఉన్నాడట. నాలుగో స్థానంలో రతిక ఉన్నదట. అత్యంత నెగిటివిటీ మూటగట్టున రతిక నాలుగో ప్లేస్ లో ఉండటం కూడా సంచలనమే.
అర్జున్ ఐదో స్థానం, తేజ ఆరో స్థానంలో ఉన్నారట. ఇక చివరి రెండు స్థానాల్లో ప్రియాంక, శోభా ఉన్నారట. ఫెయిర్ ఎలిమినేషన్ జరిగితే శోభా శెట్టి లేదా ప్రియాంక తట్టాబుట్టా సర్దాల్సిందే. హౌస్లో నలుగురు అమ్మాయిలే ఉన్నారు కాబట్టి తేజను బలి చేయవచ్చు. లేదంటే భోలేని. అయితే భోలే హౌస్లో ఎంటర్టైనర్ గా మారాడు. అందుకే ఆయనకు ఓట్లు పడుతున్నాయి. టాప్ 2 లో ఉన్న కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసే సాహసం చేయకపోవచ్చు. ఇక చూడాలి బిగ్ బాస్ ఎవరిని ఇంటికి పంపుతారో...