Bigg Boss Telugu 7: శోభాను కాపాడేందుకు అన్ ఫెయిర్ ఎలిమినేషన్స్... ఈ వారం మరొకరు బలి!
సర్వేలు అన్నీ శోభా ఎలిమినేట్ అవుతుందని చెబుతుండగా... బిగ్ బాస్ నిర్వాహకులు మరొక అన్ ఫెయిర్ ఎలిమినేషన్ కి సిద్ధమయ్యారనే వాదన మొదలైంది. షాకింగ్ ఎలిమినేషన్ ఉండొచ్చని అంటున్నారు.

బిగ్ బాస్ షోపై పరిమితులు లేవు. ఇటీవల హైకోర్టు కొంతలో కొంత కట్టడి చేసింది. బిగ్ బాస్ షోకి కూడా సెన్సార్ అవసరమని చెప్పింది. అలాగే ఈ షోకి రూల్స్, రెగ్యులేషన్స్ లేవు. బిగ్ బాస్ దే తుది నిర్ణయం. కీలకమైన ఎలిమినేషన్ విషయంలో ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రేక్షకుల ఓట్లు ఆధారంగానే ఎలిమినేషన్ అంటారు. అయితే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయట జనాలకు తెలియదు. ఒక ట్రాకింగ్ సిస్టం లేదు.
అనధికారిక పోల్స్ ఆధారంగా నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది జనాలు అంచనా వేస్తుంటారు. ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రాసెస్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పలు మార్లు బిగ్ బాస్ షో ఆరోపణలు ఎదుర్కొంది. ఇక సీజన్ 7లో ఓ కంటెస్టెంట్ ని కాపాడేందుకు మిగతా వారిని బలి చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. సీరియల్ బ్యాచ్ కి చెందిన శోభా శెట్టి ఆట తీరు, యాటిట్యూడ్ జనాలకు నచ్చడం లేదు.
ఆమెను ఎలిమినేట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. శోభా గత వారం ఇంటిని వీడుతుందని గట్టిగా వినిపించింది. సడన్ గా సందీప్ పేరు తెరపైకి వచ్చింది. శోభాతో పోల్చితే సందీప్ స్ట్రాంగ్ ప్లేయర్. ఓటింగ్ లో వెనుకబడ్డ శోభాను కాకుండా సందీప్ ని ఎలిమినేట్ చేశారనే వాదన వినిపించింది. ఈ వారం కూడా శోభా ఎలిమినేషన్ లో ఉంది. ప్రియాంక, శోభా చివరి రెండు స్థానాల్లో ఉన్నారని అనధికారిక పోల్స్ తెలియజేస్తున్నాయి.
ముఖ్యంగా శోభా అవుట్ అని అంచనా వేశారు. అయితే ఆమెను కాపాడేందుకు మరోసారి రంగం సిద్ధం చేశారని అంటున్నారు. ఊహించని విధంగా తేజ లేదా అర్జున్ లలో ఒకరిని బయటకు పంపొచ్చని సోషల్ మీడియా టాక్. శోభా విషయంలో స్టార్ తీరు విమర్శలపాలు అవుతుంది. మరి చూడాలి శోభా ఖాతాలో ఈసారి ఎవరు బలి పశువు అవుతారో...