Bigg Boss Telugu 7: శోభా శెట్టికి చుక్కలు చూపించిన బిగ్ బాస్... అమ్మను తలచుకుని ఏడ్చేసిన కార్తీకదీపం విలన్!
బిగ్ బాస్ హౌస్లో మూడో కంటెండర్ అయ్యేందుకు పోటీ జరుగుతుంది. రేసులో ప్రిన్స్ యావర్, అమర్ దీప్, శోభా శెట్టి ఉన్నారు. టాస్క్ లో భాగంగా శోభా శెట్టికి బిగ్ బాస్ కఠిన పరీక్ష పెట్టాడు.

ఆట సందీప్, శివాజీ పవర్ అస్త్ర గెలిచి కంటెండర్స్ అయిన విషయం తెలిసిందే. మూడో కంటెండర్ రేసులో ప్రిన్స్ యావర్, అమర్ దీప్, శోభా శెట్టి ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లు బిగ్ బాస్ స్వయంగా సూచించారు. వీరిలో ఒకరికి పవర్ అస్త్ర దక్కుతుంది. దాన్ని టాస్క్స్ లో గెలిచి సాధించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ప్రిన్స్ యావర్ కి నిన్న ఓ టాస్క్ ఇచ్చారు. తలను ఒక స్థానంలో ఉంచాలి. ఇతర కంటెస్టెంట్స్ ఏం చేసినా అక్కడ నుండి తీయకూడదు అని చెప్పాడు. ఈ టాస్క్ లో ప్రిన్స్ యావర్ గెలిచాడు.
నెక్స్ట్ శుభశ్రీకి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అత్యంత కారంగా ఉన్న చికెన్ తినాలని ఆదేశించాడు. కాన్ఫిడెంట్ గా టాస్క్ మొదలుపెట్టిన శోభాకు చుక్కలు కనిపించాయి. కారంతో కూడిన చికెన్ తినలేక అరుపులు పెట్టింది. వాళ్ళ అమ్మను తలచుకుంటూ ఏడ్చేసింది. లైఫ్ లో ఇంత కారం రుచి చూడలేదని చెప్పింది. శోభా చాలా కఠినంగా ఫీల్ అయ్యింది. నువ్వు ఎంత ఎక్కువ తింటే అంతగా నీ ప్రత్యర్థుల బెంచ్ మార్క్ సెట్ చేస్తావని బిగ్ బాస్ చెప్పాడు. అందుకే నోరు మండిపోతున్నా ఎక్కువ చికెన్ తినే ప్రయత్నం చేసింది.
కాగా కంటెండర్ అయ్యేందుకు బిగ్ బాస్ ఎంపిక చేసిన ముగ్గురిలో శోభా శెట్టి అనర్హురాలని చెప్పిన ముగ్గురికి బిగ్ బాస్ ఇదే తరహా టాస్క్ పెట్టాడు. శోభా శెట్టికి వ్యతిరేకంగా పల్లవి ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ ఓటు వేసిన క్రమంలో వీరికి బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. ముగ్గురి ముందు చికెన్ బౌల్స్ పెట్టారు. ముగ్గురిలో ముందుగా బౌల్ లో ఉన్న చికెన్ తినేసిన వారికి శోభా శెట్టి స్థానంలో కంటెండర్ పోస్ట్ కి పోటీపడే ఛాన్స్ దక్కుతుందని చెప్పాడు.
ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారో పూర్తి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. తాజా ప్రోమో ఆసక్తి రేపేదిగా ఉంది. కాగా 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ షో మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ అయ్యారు. అమర్ దీప్, దామిని, ప్రియాంక, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, రతికా రోజ్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు.